అదే పనిగా 4 గంటలపాటు.. శ్రద్ధాకపూర్ జోరు చూస్తే ఇక అంతేనట..
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ వరుస చిత్రాలతో జోష్ పెంచారు. సాహో చిత్రం షూటింగ్ పూర్తయిందో లేదో మరో సినిమాపై దృష్టిపెట్టారు. బాలీవుడ్ చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారట. ఈ చిత్రానికి రెమో డి సౌజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. స్వతహాగా వరుణ్ ధావన్ డ్యాన్సర్ కావడంతో ఆయనకు ధీటుగా సినిమాలో స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతున్నారట.
డ్యాన్స్ ప్రధానమై సినిమా కావడంతో శ్రద్దాకపూర్ ట్రైనింగ్ తీసుకొంటున్నదట. అంతేకాకుండా బాడీ నాజుకుగా ఉండటానికి ఆహార నియమాలను పాటిస్తుందట. ప్రత్యేకమైన ఫుడ్‌ను కూడా ప్రిఫర్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రద్దాకపూర్ ఫోకసంతా డ్యాన్స్, జిమ్‌పైనే పెట్టిందట. తాజాగా టూ ప్యాక్ ఆబ్ బాడీతో సెల్ఫీ దిగింది. ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది.

స్ట్రీట్ డ్యాన్సర్ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకొన్నది. మరో 10 రోజులు ఈ సినిమా షూటింగ్ అత్యంత కీలకంగా మారనున్నది. అందుకోసం శ్రద్దాకపూర్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నది. ప్రతీ రోజు నాలుగు గంటలు అదేపనిగా డ్యాన్సులు, వర్కవుట్లు చేస్తున్నది. దాంతో ఆమె ఫిట్‌నెస్ లెవెల్స్ అనూహ్యంగా పెరిగాయి. రెండు నెలల్లోనే అద్భుతమైన ఫిట్‌నెస్‌ను సమకూర్చుకొన్నది అని సినిమా యూనిట్ సభ్యులు వెల్లడించారు.
స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రం 3డీలో తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాకపూర్ అందాలు, ఫిట్‌నెస్ తెరపైన అద్భుతంగా కనిపించేలా చర్యలు తీసుకొంటున్నారు. ఈ సినిమాలో డ్యాన్స్ సీక్సెన్స్ ఇప్పటి వరకు రాని విధంగా ఉంటాయని చెప్పుకొంటున్నారు.
సాహో చిత్రంలో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. స్వాత్రంత్య ఉద్యమం నేపథ్యంగా సాగే కథలో కీలక పాత్రను, అలాగే మోడ్రన్ టైమ్స్‌లో గ్లామర్ హీరోయిన్‌గా శ్రద్ధా కనిపిస్తారు. ఇక సాహో చిత్రం ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రం ద్వారా శ్రద్దా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నది.


Click it and Unblock the Notifications











