ఇండియా, పాకిస్థాన్ మధ్య డ్యాన్స్ పోటీ.. రెచ్చిపోయిన శ్రద్దా, వరుణ్ ధావన్
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఏదైనా పోటీ ఉంటే.. ఎంత మజాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ విషయంలోనైతే ఆ ఫీలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య డ్యాన్స్ పోటీ తెరపై ఆసక్తికరంగా మలిచేందుకు వస్తున్నారు. ఏబీసీడీ, ఏబీసీడీ2 లాంటి చిత్రాలతో మెప్పించిన వరుణ్ దావన్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా వచ్చేస్తున్నారు. నృత్య నేపథ్యంతో తెరకెక్కిన ఆ రెండు సినిమాలకు కొనసాగింపుగానే వస్తోన్న స్ట్రీట్ డ్యాన్సర్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది.
ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే డ్యాన్స్ పోటీల నేపథ్యంలో ఈ స్ట్రీట్ డ్యాన్సర్ ఉండబోతోందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో వరుణ్ ధావన్, శ్రద్దా కపూర్ టీమ్స్ పోటీ పడబోతోన్నాయి. వీరిని సరైన గాడిలో పెట్టే కోచ్‌గా ప్రభుదేవా కనిపించబోతోన్నట్లు అర్థమవుతుంది. ఒకప్పటి క్లాసిక్ అయిన ముక్కాల ముక్కాబులా సాంగ్‌ను అద్భుతంగా రీమేక్ చేసినట్టు కనిపిస్తోంది.

ఏబీసీడీ, ఏబీసీడీ2లో చేసిన వాటికంటే భిన్నమైన, కఠినమైన డ్యాన్సులను ఈ మూడో పార్ట్‌లో చేసినట్టు కనిపిస్తోంది. శ్రద్దా కపూర్, వరుణ్ దావన్‌ల స్టెప్పులే కాకుండా వారిద్దరి మధ్య ఘాటైన రొమాన్స్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. రెమో డిసౌజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని భూషన్ కుమార్, దివ్యా ఖోస్లా కుమార్, క్రిష్ణ కుమార్, లిజెల్లే డిసౌజాలు నిర్మించారు. ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











