సాహో సెట్లో శ్రద్ధాకపూర్ హంగామా.. ఏం చేశారంటే.. (వీడియో)
బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ సాహో సెట్లో సందడి చేశారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం స్త్రీ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. స్త్రీ రిలీజ్ తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సాహో సెట్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సినిమా విజయానందాన్ని సెట్లో కేక్ కోసి సంబరాలు చేసుకొన్నారు. తన విజయోత్సవ వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.
సాహో చిత్ర షూటింగ్‌తో రోజంతా అలసిపోయాను. స్త్రీ చిత్రం విజయవంతమైన నేపథ్యంలో నా సన్నిహితులు కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. వారి ప్రేమకు నేను పొంగిపోయాను అని శ్రద్దాకపూర్ పేర్కొన్నారు.
రాజ్‌కుమార్ రావుతో కలిసి శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతున్నది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.50 కోట్లు వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రస్తుతం సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దాకపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా దక్షిణాది.. ముఖ్యంగా టాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో రూపొందుతున్న చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











