సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధా కపూర్ ఔట్... కారణం ఏమిటంటే?
Recommended Video

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితంపై బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిదే. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేశారు. కొంతకాలం ఆమె బ్యాడ్మింటన్లో శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ధా కపూర్ తప్పుకున్నారు.
ఇంతకాలం ట్రైనింగుతో పాటు యాక్టింగ్ వర్క్ షాప్స్ నిర్వహించిన అనంతరం ఉన్నట్టుండి శ్రద్ధా కపూర్ తప్పుకోవడం ముంబై సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. శ్రద్ధా తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిందట.

ఏం జరిగింది?
ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. షూటింగ్ లేటుగా మొదలు అవుతుండటం, ఇతర సినిమాల డేట్స్ క్లాష్ అవుతుండటంతో శ్రద్ధా కపూర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

వివాదం లేకుండా పరస్పర అంగీకారంతో
వివాదం లేకుండా పరస్పర అంగీకారంతో... ఇటు శ్రద్ధా కపూర్, అటు దర్శక నిర్మాతలు ఈ విషయంలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిర్మాత మాట్లాడుతూ..
శ్రద్ధా కపూర్ తప్పుకోవడంపై నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ...‘ఈ సంవత్సరం చివరి వరకు సైనా మూవీ షూటింగ్ పూర్తి చేసి 2020లో విడుదల చేయాలనుకున్నాం. శ్రద్ధా తప్పుకోవడం వెనక వివాదం లేదు. పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయం. ఆమె స్థానంలో పరిణీతి చోప్రా నటించబోతోంది ఒలంపిక్స్ జరిగే సంవత్సరంలో సైనా చిత్రం విడుదల అవుతుండటం గర్వించే విషయం' అన్నారు.

శ్రద్ధా కపూర్ బిజీ బిజీ
శ్రద్ధా కపూర్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ‘చిచ్చోరే', ‘స్ట్రీట్ డాన్స్ 3డి', ‘సాహో', ‘భాగి 3' ఇలా వరుస సినిమాలు చేస్తుండటంతో ‘సైనా' షూటింగ్ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











