"స్పైడర్ మ్యాన్"తో క్లోజ్‌గా "సాహో" బ్యూటీ .. ఏంటీ సంగతి?

వరల్డ్ వైడ్‌గా పలు చిత్రాలకి భారీ ఆదరణ ఉంటుంది. ఒక్క ఆ భాష లేదా ఇండస్ట్రీ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా యాక్సెప్ట్ చేసే సినిమాల్లో సూపర్ హీరో జానర్ చిత్రాలు కూడా ఒకటి. ఇలా ఈ జానర్ లో ఎన్నెన్నో చిత్రాలు ఎందరో సూపర్ హీరోలు కనిపిస్తారు. కాగా ఈ సూపర్ హీరోస్ లో మార్వెల్ అండ్ డీసీ అంటూ రెండు పాపులర్ కామిక్స్.. వాటిలో క్రేజీ సూపర్ హీరోలు కనిపిస్తారు.

కాగా వీరిలో చాలా మందికి మోస్ట్ ఫేవరేట్ సూపర్ హీరోస్ లో "స్పైడర్ మ్యాన్" అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు. కామిక్స్ నుంచి మొదట వెస్ట్రన్ ఆడియెన్స్ కి పరిచయం అయితే సినిమాల తర్వాత అనేక దేశాల ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యాడు. మరి ఈ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో మొత్తం మూడు ఫ్రాంచైజ్‌లు మార్వెల్ నుంచి రాగా.. వాటిలో "ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్" సిరీస్ కూడా ఒకటి.

shraddha kapoor meet with spider man hero Andrew Garfield takes charge

కాగా ఈ సిరీస్ లో స్పైడర్ మ్యాన్ గా ఆండ్రూ గ్యార్ ఫీల్డ్ నటించగా ఆయన ఆడియెన్స్‌లో బాగా క్లిక్ అయ్యాడు. చాలా మంది తన మూడో సినిమా కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం రెండు సినిమాలతోనే ఆపేసారు. మరి ఈ హాలీవుడ్ హీరోతో లేటెస్ట్‌గా ఇండియాస్ టాప్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కలిసి కనిపించడం అనేది సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఓ హాలీవుడ్ హీరోతో మన ఇండియన్ హీరోయిన్ కలిసి కనిపించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్ లో బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా ఆల్రెడీ వెళ్లి సెటిల్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు ఈ కలయిక అనేది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారా? లేదా ఏదన్నా సినిమా చేస్తున్నారా అంటూ చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అలాగే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే అసలు ఈ కలయిక ఊహించలేదు ఇదేం షాక్ అంటున్నారు. కానీ దీని వెనుక వేరే ఏదో పర్సనల్ కారణాలు ఏవి లేవట. ఇంటర్నేషనల్ వైడ్ గా జరిగిన ఓ సినిమా రిలేటెడ్ ఫిలిం ఫెస్టివల్ లో కలవడం జరిగింది. దీనితో అలా వీరి కలయిక సాధ్యం అయ్యింది కానీ వేరే ఏ కారణాలు కాదట. అయితే ఈ కలయిక సందర్భంగా ఇద్దరు కాసేపు ముచ్చటించారు.

దీనితో వీరి కాంబినేషన్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. కాగా శ్రద్దా కపూర్ రీసెంట్ గా బాలీవుడ్ లో "స్త్రీ 2" తో సెన్సేషనల్ హిట్ అందుకోగా మన తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో "సాహో" లో కనిపించింది. ఇక స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో అయితే 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' తో చివరిసారిగా అలరించారు. ఈ చిత్రం తర్వాత అంతా స్పైడర్ మ్యాన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X