twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవర్‌తో బైక్‌‌పై చక్కర్లు.. ముంబై రోడ్లపై కెమెరాకు చిక్కిన శ్రద్ధాకపూర్

    |

    లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ తారలు ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. గత 100 రోజులకుపైగా గృహ నిర్బంధంలో ఉన్న యాక్లర్లు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా శ్రద్ధాకపూర్ కూడా గృహ నిర్బంధాన్ని వీడి రోడ్డపై బైక్ తిరుగుతూ మీడియా కంటపడింది. అయితే తన ప్రియుడితో ఊరేగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

    మహారాష్ట్రలో సందడి సందడిగా

    మహారాష్ట్రలో సందడి సందడిగా

    లాక్‌డౌన్ తర్వాత కొన్ని సడలింపులు ఇస్తూ అన్‌లాక్ 1.0 తో ప్రధాన వ్యాపార సముదాయాలు, అవుట్ డోర్ యాక్టివిటీస్ మహారాష్ట్రలో మొదలయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ వ్యవహారాలను చక్కబెట్టుకొంటున్నారు. ముంబైలో పలు కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగులు గురువారం మొదలయ్యాయి. పలువురు సినీ తారలు సెట్స్‌లో కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ షూటింగులు జరిపారు.

    సినీ తారల హంగామా

    సినీ తారల హంగామా

    అన్‌లాక్ 1.0 అమలు అవుతున్న నేపథ్యంలో మల్లికా శరావత్, శక్తికపూర్ లాంటి సినీ ప్రముఖులు వీధుల్లోకి వచ్చి కనిపిస్తున్నారు. పలువురు సినీ తారలు సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ కనిపించారు. మరికొందరు షాపింగ్, రెస్టారెంట్ల వద్ద కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పలువురు షూటింగులకు హాజరుకావడం కూడా జరిగింది. తాను తన డైరెక్టర్‌కు హగ్ ఇవ్వలేకపోయానని అక్షయ్ కుమార్ గురువారం మీడియాతో అన్నారు. ఇలా బాలీవుడ్‌లో హంగామా కొనసాగుతుంటే శ్రద్దాకపూర్ మాత్రం జాలీగా గడిపేస్తున్నారు.

    ప్రియుడి వాహనంపై

    ప్రియుడి వాహనంపై

    ఇక శ్రద్దాకపూర్ తన ప్రియుడు రోహన్ శ్రేష్టతో బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో స్కూటీపై లవర్‌తో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కారు. ముఖానికి మాస్క్‌తో, ఒంటిపై జిమ్ డ్రస్‌తో రోహన్‌తో కలిసి వాహనంపై జోష్‌తో గాల్లో తేలిపోయింది. ప్రియుడు వాహనం నడుపుతుండగా స్కూటర్ వెనుక సీట్లో శ్రద్ధాకపూర్ కూర్చొని ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

    గత రెండేళ్లుగా లవర్‌తో డేటింగ్

    గత రెండేళ్లుగా లవర్‌తో డేటింగ్

    ఇక శ్రద్దాకపూర్ విషయానికి వస్తే.. రోహన్ అనే సెలబ్రిటీతో గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే శ్రద్దాకపూర్ మాత్రం తనపై వచ్చే వార్తలను పట్టించుకోవడం లేదు. ఎలాంటి కామెంట్లు కూడా చేయకుండా తనపనేదో తాను చూసుకొంటున్నది.

    Recommended Video

    Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
    సాహో తర్వాత శ్రద్ధాకపూర్

    సాహో తర్వాత శ్రద్ధాకపూర్

    బ్యూటీ శ్రద్దాకపూర్ కెరీర్ విషయానికి వస్తే.. సాహోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో భాగీ 3 అనే చిత్రంలో నటించింది. లాక్‌డౌన్ ముందు రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించడం జరిగింది.

    English summary
    Bollywood Actress Shraddha Kapoor riding bike on Lover Rohan Shrestha bike. Shraddha was snapped in Bandra of Mumbai, She was seated behind Rohan in the scooty. Both were seen wearing a mask.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X