twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రద్దాకపూర్ మాజీ ప్రియుడికి నిశ్చితార్థం.. ఎవరితో తెలుసా?

    |

    ఆషికీ 2 సినిమాతో వెండితెర మీద మెరిసిన తారలు ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్దా కపూర్ అప్పట్లో ప్రేమలో మునిగి తేలారనే వార్తలు బాలీవుడ్‌లో గట్టిగానే వినిపించాయి. ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్లిన ఆ వ్యవహారం మధ్యలోనే బెడిసి కొట్టింది. అయితే ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్ మోడల్ దివ ధావన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల కరణ్ జోహర్ నిర్వహించే టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 6లో పాల్గొన్న ఆదిత్య తన తాజా అఫైర్ గురించి వివరణ ఇచ్చారు. ఆదిత్య చెప్పిన విషయం ఏమిటంటే..

    దివ ధావన్‌తో లింకు

    దివ ధావన్‌తో లింకు

    దివ ధావన్ చాలా మంచి అమ్మాయి. నాకు పాత పరిచయం ఉన్న స్నేహితురాలు. చాలా ఏళ్ల క్రితం ఫ్యాషన్ షోలో కలిశాం. అప్పటి నుంచి మా మధ్య మంచి స్నేహం బలపడింది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువగా వెళ్లే బిస్తాయా అనే రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లడం మీడియా కంట పడింది. దాంతో వారి మధ్య ఏదో వ్యవహారం గుట్టుగా సాగుతుందనే కథనాలు వెలువడ్డాయి.

    త్వరలోనే నిశ్చితార్థం

    త్వరలోనే నిశ్చితార్థం

    ఆదిత్య, దివ ధావన్ పెళ్లి నిశ్చితార్థం జరిగిందని బాలీవుడ్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. వారిద్దరు తమ రిలేషన్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే వారిద్దరి నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. వచ్చే ఏడాది ఆదిత్య కపూర్, దివ ధావన్ పెళ్లికి ఏర్పాటు చేసుకొంటున్నారు అని కథనంలో పేర్కొన్నారు.

     పీకల్లోతూ ప్రేమలో

    పీకల్లోతూ ప్రేమలో

    ఆదిత్య కపూర్, దివ అఫైర్ వార్తలు ఇటీవల బాలీవుడ్ మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దివ ధావన్‌తో ఆది డేటింగ్ చేస్తున్న విషయం నిజమే. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొద్ది రోజుల నుంచి వారిద్దరూ కలిసి మెలిసి ఉంటున్నారు అని మరో బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది.

     టాప్ మోడల్‌గా దివ

    టాప్ మోడల్‌గా దివ

    ఫ్యాషన్ రంగంలో దివ ధావన్ టాప్ మోడల్‌గా రాణిస్తున్నారు. మనీషా మల్హోత్రా, జేజే వలాయ, తరుణ్ తాహిలియాని లాంటి డిజైనర్లతో పనిచేస్తున్నది. న్యూయార్క్‌లో పలు చారిటీ షోలకు సంబంధించిన ర్యాంప్ వాక్‌పై హోయలు ఒలికించారు. ఇక ఆదిత్య రాయ్ కపూర్ బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

    English summary
    Bollywood Aditya Roy Kapur made his appearance on Koffee With Karan season 6 earlier this year, he addressed the rumours of him dating model Diva Dhawan. He said, She's a lovely girl and an old friend of mine. We met at a fashion show many years ago and we're good friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X