»   » సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్.. అచ్చం సైనాను చూసినట్లే...!

సైనా నెహ్వాల్ బయోపిక్: శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్.. అచ్చం సైనాను చూసినట్లే...!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భారత బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహాల్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ మాత్రమే ఎక్కువ ఆదరణ పొందిన మన దేశంలో బాడ్మింటన్ క్రీడవైపు అంతా ఆకర్షితులయ్యేలా చేసిన వారిలో సైనాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. పలు ఇంటర్నేషనల్ టోర్నీలో భారత మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన సైనా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

  Shraddha Kapoors First Look as Saina from her Bio-pic

  ఈ బయోపిక్‌లో సైనా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో పాత్ర చేయడం కోసం శ్రద్ధా కొన్ని రోజులుగా బాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంటోంది. సెప్టెంబర్ 22 నుండి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లడంతో.... సినిమాలో సైనా పాత్రలో శ్రద్ధా కపూర్ ఎలా కనిపించబోతోందో వెల్లడిస్తూ ఓ పిక్ విడుదల చేశారు.

  ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ టి-సిరీస్ వారు నిర్మిస్తున్నారు. అముల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్ నిర్మాత. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన పలు బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సైనా నెహ్వాల్ బయోపిక్ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

  పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

  శ్రద్ధా కపూర్ 'సైనా బయోపిక్'‌తో పాటు తెలుగు మూవీ 'సాహో'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన బాలీవుడ్ మూవీ స్త్రీ ఇటీవల విడుదలైన రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం క్రియేట్ చేసింది. మరో చిత్రం 'బట్టి గుల్ మీటర్ చాలు' మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

  English summary
  Shraddha Kapoor is currently basking in the success of her latest release 'Stree' which has hit the right chord amongst the viewers. The actress is now gearing up for filming her next which is a biopic based on the ace Indian shuttler Saina Nehwal. The film went on floors on September 22, 2018, and is produced by T-Series. The film will be helmed by Amul Gupte and is backed by Bhushan Kumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more