ఒకేసారి ముగ్గురితో.. ఏకధాటిగా ఐదుగంటలు.. కష్టమే కానీ.. శ్రద్ధాకపూర్!
సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా మారిన అందాల భామల్లో శ్రద్దాకపూర్ ఒకరుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, చిచోర్, సాహో చిత్రాల్లో నటిస్తూ ఎడతెరుపని బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎంత బిజీగా ఉన్నారంటే ఒక రోజు లండన్‌లో ఉంటే మరో రోజు హైదరాబాద్‌లోనో లేదా ముంబైలోనో ఉంటున్నారు. ఈ మూడు నగరాల మధ్య శ్రద్ధా చక్కర్లు కొడుతున్నదంటే శ్రద్దాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ టూ లండన్ వయా ముంబై
శ్రద్ధాకపూర్ ఇటీవల ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నది. అక్కడి నుంచి నేరుగా లండన్‌కు చేరుకొన్నది. లండన్‌లో వరుణ్ ధావన్‌తో దర్శకుడు రెమో డిసౌజా రూపొందించే చిత్ర షూటింగ్‌కు హాజరైంది. అనంతరం ముంబైలో జరుగుతున్న చిచ్చోర్ చిత్ర చిత్రీకరణలోను పాలుపంచుకొన్నది.

షూటింగ్‌లతోపాటు డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ
ఇలా మూడు చిత్రాలకు ఏకకాలంలో పనిచేస్తూనే స్ట్రీట్ డ్యాన్సర్ సినిమా కోసం ఆఫ్రో, ఆర్బన్, క్రంప్, లాకింగ్, పాపింగ్ డ్యాన్సులో శిక్షణతోపాటు ట్యుటింగ్, యానిమేషన్ లాంటి విద్యను నేర్చుకొంటున్నది. అంతేకాకుండా రోజుకు ఐదు గంటలపాటు డ్యాన్స్ రీహార్సల్ చేస్తున్నట్టు తెలిపింది. ముంబైలో కాకుండా విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌లకు హాజరైతే అక్కడ కూడా రిహార్సల్‌ను కొనసాగిస్తున్నారట.

సైనా నెహ్వాల్ సినిమా కోసం
ఇదిలా పక్కన పడితే, ఇక సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం శ్రద్ధాకపూర్ ప్రిపేర్ అవుతున్నది. సైనా పాత్రలో ఒదిగిపోవడానికి బాడ్మింటన్ క్రీడలో మెలుకువలపై దృష్టిపెట్టింది. సమయం చిక్కినప్పుడల్లా శ్రద్ధా బాడ్మింటన్ క్రీడలో కూడా శిక్షణ పొందుతున్నట్టు వెల్లడించారు. త్వరలోనే సైనా నెహ్వాల్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనున్నది.

ఒకేసారి మూడు సినిమాలతో
ఇటీవల శ్రద్ధాకపూర్ మాట్లాడుతూ.. షూటింగులు, ప్రయాణాలతో బిజీగా ఉండటం చూస్తే చాలా క్రేజీగా ఉంది. ఒకేసారి మూడు సినిమాలకు పనిచేయడం కొత్తగా ఉంది. ఆ సినిమాల కోసం ప్రిపేర్ కావడం కొంత కష్టమైనప్పటికీ.. హ్యాపీగా ఉంది. ఈ మూడు సినిమాలు పూర్తికాగానే మరో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి అని శ్రద్దా చెప్పారు.

ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను
వరుస షూటింగ్‌ల కారణంగా బిజీగా మారడంతో కొంత వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతున్నాను. కానీ సినిమా ఆఫర్లు వదులుకోలేని పరిస్థితి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోకపోతే పరిస్థతి మరోలా మారిపోతుంది. పనిలో పడిపోయి ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అని శ్రద్ధాకపూర్ చెప్పారు. ఇటీవల రిలీజైన స్త్రీ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











