జిరాఫీని ముద్దాడి.. ప్రేమగా తినిపిస్తున్న ‘సైరా’ గాయని..

శ్రేయా ఘోషాల్ సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు పాట పాడితే.. తెలుగు అమ్మాయే పాడింది కదా అని అనుకునేంతగా స్పష్టంగా పాడటం ఆమెకున్న బలం. ఏ భాషలో పాడినా.. పాటలోని భావాన్ని పెంచేలానే పాడుతుంది. ఆమె గొంతులోని మాధుర్యంతో పాట స్థాయిని పెంచుతుంది. తాజాగా సైరా సాంగ్ ను అద్భుతంగాపాడి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

తెలుగులో ఎన్నో పాటలు పాడిన శ్రేయా ఘోషాల్.. ఇక్కడ మరెంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు అందరి దర్శకుల దగ్గర పనిచేసిన శ్రేయాకు తెలుగులో మరుపురాని హిట్ పాటలు ఉన్నాయి. ఒక్కడు (నువ్వేం మాయ చేశావో గానీ..) సినిమాతో మొదలైన తన ప్రయాణం నేటికి కొనసాగుతోంది. సైరా సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మరోసారి అందర్నీ ఆకట్టుకుంది. ఆమెతో పాటు మరో బాలీవుడ్ సింగర్ సునిధి చౌహాన్ పాడిన ఈ పాట థియేటర్లలో రోమాలు నిక్కబొడుచేలా చేస్తోంది.

Shreya Ghoshal Kisses Giraffe And Feed It In Nairobi

జిరాఫీని ముద్దాడి.. గోరు ముద్దలు తినిపిస్తోంది..కెన్యాలోని నైరోబిలో ఉన్న జిరాఫీల కేంద్రానికి వెళ్లి ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. జిరాఫీని ముద్దాడి, తినిపిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సునిధి చౌహాన్ వావ్ అనే కామెంట్ పెట్టంది. మరి శ్రేయా ఘోషాల్ విదేశాల్లో ఉండటంతో.. తాను పాడిన పాట, సినిమా ఇంత పెద్ద హిట్ అయిందన్న సంగతి ఈ గాయనికి తెలిసిందో లేదో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X