ఆయనతో ఉన్నప్పుడు పదహారేళ్ల అమ్మాయిలా ఫీలవుతా.. అతనే నా ప్రపంచం
ఏ భాషలో పాట పాడినా, ఏ రకమైన పాట పాడినా.. బాణీకి తగ్గట్టు, భాషకు తగ్గట్లు పాడే గాయని శ్రేయా ఘోషాల్. సంగీతం ప్రపంచంలో శ్రేయా ఘోషాల్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎన్ని భాషల్లో పాట పాడినా.. ఆ ప్రాంతానికే చెందిన అమ్మాయని ఫీలవుతారు శ్రోతలు.

తెలుగులో ఎన్నో మరుపురాని హిట్ సాంగ్స్..
ఒక్కడు చిత్రంతో మొదలైన ఆమె ప్రయాణం నేటికి దిగ్విజయంగా సాగుతోంది. మణిశర్మ దగ్గరి నుంచి నేటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకు అందరితో కలిసి పనిచేసింది. ఆమె పాట పాడుతుందంటే.. దానికంటూ ఓ ప్రత్యేకత ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తుంటారు.

తాజాగా సైరా టైటిల్ సాంగ్..
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. దేశ వ్యాప్తంగా సైరా ఫీవర్ నడుస్తోంది. బాలీవుడ్ లోనూ ‘వార్' మూవీకి ధీటుగా కలెక్షన్లను రాబడుతోంది. అన్ని చోట్లా మంచి స్పందన వస్తున్న ఈ మూవీలో అమిత్ త్రివేది అందించిన సంగీతం అతి పెద్ద బలంగా మారింది. సైరా టైటిల్ సాంగ్ థియేటర్లతో వింటుంటే.. ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ పాటను శ్రేయా ఘోషాల్, సునిధి చౌహాన్ కలిసి ఆలపించారు. ఇలా శ్రేయా ఘోషాల్ పాడిన ప్రతీ పాట ఓ సెన్సేషనే.
భర్త పుట్టిన రోజు.. ఎమోషనల్ పోస్ట్
శ్రేయా ఘోషాల్ తన చిన్ననాటి స్నేహితుడు.. శైలాదిత్యను వివాహం చేసుకున్నారు. అయితే ఆమెకు తన భర్త అంటే ఎంత ఇష్టమో ఈ పోస్ట్ చూస్తేనే తెలుస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే మై లవ్.. ఆరోగ్యంగా సంతోషంగా, ప్రతీ క్షణం నవ్వుతూ ఉండాలి. మనకు వయసు పెరుగుతోంది.. కానీ, నీతో ఉంటే నేను పదహారేళ్ల అమ్మాయిలానే ఫీలవుతా.. ఈ ప్రపంచంలో నువ్వే గొప్ప భర్తవి, కొడుకువి, తమ్ముడివి, అన్నవి, స్నేహితుడివి.. లవ్యూ సో మచ్' అంటూ సోషల్ మీడియాలో వేదికగా తన భర్తపై ఉన్న అమితమైన ప్రేమను వ్యక్త పరిచింది.


Click it and Unblock the Notifications











