twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భర్త ఆ విషయంలో ఫుల్ సపోర్ట్.. ఎప్పటికీ వదులుకోను.. శ్రీయ హాట్ కామెంట్

    |

    అందాల తార శ్రీయ సరన్ తాను ప్రేమించిన రష్యా వ్యాపారవేత్త అండ్రై కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకోవడం 2018లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా సాగిన తన పెళ్లికి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తాజాగా తన పెళ్లికి తక్కువ మంది ఆహ్వానితులను పిలవడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీయ ఏమని స్పందించిందంటే..

     2018 మార్చిలో రాజస్థాన్‌లో

    2018 మార్చిలో రాజస్థాన్‌లో

    2018 మార్చిలో రాజస్థాన్‌లో అండ్రూ కొశ్చీవ్‌ను పెళ్లాడిన తర్వాత వ్యాపార నిమిత్తం బార్సిలోనాకు షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత కూడా హిందీ, దక్షిణాది సినిమాల్లో వచ్చిన ఆఫర్లను అందుకొని నటిస్తున్నాను. తాజాగా హిందీ చిత్రం సబ్ కుశల్ మంగళ్ అనే సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాను అని శ్రీయ వెల్లడించింది.

    అప్పుడే రెండేళ్లు అయిందా?

    అప్పుడే రెండేళ్లు అయిందా?

    గుట్టుచప్పుడుగా జరిగిన పెళ్లి విషయంపై శ్రీయ జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. అండ్రైతో నా పెళ్లి జరిగి అప్పుడే రెండేళ్లు అయిందా? అనే విషయాన్ని తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో దాచాల్సింది ఏమీ లేదు. సింపుల్‌గా ప్రైవేట్ వ్యవహారంగా పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాం. అందుకే ఆహ్వానితుల జాబితా అంత పెద్దగా లేదు అని శ్రీయ చెప్పింది.

    పరిచయం చాలా గమ్మత్తుగా

    పరిచయం చాలా గమ్మత్తుగా

    అండ్రై కొశ్చీవ్‌తో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. మూడేళ్ల క్రితం మాల్దీవులకు విహార యాత్రకు వెళ్లిన సమయంలో కలుసుకొన్నాం. ఇద్దరం కలిసి సముద్ర అడుగు భాగంలో డైవింగ్ చేసి సాహాసానికి పాల్పడ్డాం. ఆ తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడానికి ఫుల్ సపోర్టు ఇచ్చారు. నేను నా ప్రొఫెషన్‌ను కొనసాగించడం ఆయనకు అత్యంత ఇష్టం అని శ్రీయ పేర్కొన్నది.

    బార్సిలోనాలో మకాం

    బార్సిలోనాలో మకాం

    బార్సిలోనాలో మకాం పెట్టినప్పటికీ షూటింగ్ కోసం ఇండియాలోని పలు ప్రాంతాలకు వెళ్తుంటాను. ముంబై అంటే నాకు చాలా ఇష్టం. నా తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. ముంబై నుంచే ఇతర ప్రాంతాలకు షూటింగ్‌కు వెళ్తుంటాను. ఇండియాతో సంబంధాలను ఎప్పటికీ వదులుకోను అని శ్రీయ అన్నారు. ప్రస్తుతం తమిళంలో సందకారి అనే చిత్రంలో నటిస్తున్నది.

    English summary
    Actor Shriya Saran reacted on her marriage with Russian-based entrepreneur Andrei Koscheev. She said, My marriage is a private affair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X