Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగాస్టార్ కొడుకు కాబట్టే హీరో.. అతడికి ఏమీ తెలియదు.. నా కుమార్తెకు ఆ గతి పట్టకూడదు!
చిత్ర పరిశ్రమలో వారసులు ఎక్కువగా వస్తుంటారు. బాలీవుడ్ లో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా బచ్చన్ ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కుమార్తె నవ్య సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ శ్వేతా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కుమార్తె నవ్య సినిమాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని శ్వేతా తెలిపింది. తమ కుటుంబంఫై కొందరు చేస్తున్న కామెంట్స్ స్వయంగా విన్నా. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూశా. ఇలాంటి పరిస్థితులే తన కుమార్తెని సినీరంగానికి దూరంగా ఉంచడానికి కారణం అని శ్వేతా తెలిపింది.
వారసుల హావా
బాలీవుడ్ లో వారసుల హవా కొనసాగుతోంది. ఇది కేవలం హీరోలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. చాలా మంది హీరోయిన్లు కూడా వారసత్వంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినవారే. అలియా భట్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఇలాంటి హీరోయిన్లంతా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఇక నవ్య బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. నా కుమార్తె సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు అని ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
మా ఫ్యామిలీ మొత్తం
మా కుటుంబంలో తొలి తరం అంతా సినిమాల్లో ఉన్నారు. ప్రస్తుతం అన్నయ్య అభిషేక్, వదిన ఐశ్వర్యరాయ్ ఉన్నారు. వారు ఎదుర్కొనే ఇబ్బందులు, సినిమాలు సరిగా ఆడని సమయంలో వారు గురయ్యే మనో వేదన కళ్లారా చూశాను. దీనికి తోడుగా బయట వ్యక్తులు అనవసరమైన కామెంట్స్ చేస్తుంటారు. వాటిని కూడా భరించాల్సి ఉంటుంది. నాకు సినిమా రంగంపై గౌరవం ఉంది. నా కుమార్తె సినిమాల్లోకి రావాలని భావిస్తే పూర్తిగా తీసుకుకుని రావాలి. వారసురాలిగా మాత్రం రాకూడదు అని శ్వేతా తెలిపింది.
అమితాబ్ బచ్చన్ కొడుకు
అన్నయ్య గురించి నేను కూడా కొన్ని కామెంట్స్ విన్నాను. బాలీవుడ్ మెగాస్టార్ కొడుకుగా అన్నయ్య చాలా పెద్ద బాధ్యత మోస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, బయటి వ్యక్తుల కామెంట్స్ ఎలా ఉంటాయంటే.. అతడు మెగాస్టార్ కొడుకు. కాబట్టే హీరో అయ్యాడు. తడికి ఏమీ తెలియదు అని కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటివి విన్నప్పుడు చాలా భాదగా అనిపిస్తుంది. కొన్ని సార్లు నిద్రలేని రాత్రులు కూడా గడిపా అని శ్వేతా తెలిపింది.
‘రాముడు'గా అమీర్ ఖాన్ కొడుకు, ‘సీత'గా ఐశ్వర్యరాయ్ కూతురు!
ఆ పరిస్థితి నా కుమార్తెకు
ఇలాంటి పరిస్థితి నా కుమార్తెకు ఎదురు కాకూడదు. అందుకే సినిమాల్లో వద్దు అని చెబుతున్నా అని శ్వేత తెలిపారు. సినిమా రంగానికి బదులు మరో వృత్తిని ఎంచుకోవడం ఉత్తమం. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. సెలెబ్రిటీలతో కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఈ షో బాగా పాపులర్ అయింది.