For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్వేతబసుకు మరో షాక్.. భర్తకు విడాకులు.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

  |
  Shweta Basu Prasad Ends Her Marriage With Rohit Mittal, Announces Separation

  టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో అలరిస్తున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌కు షాక్ తగిలింది. ఇప్పటికే పలు వివాదాలను అధిగమించిన శ్వేత జీవితానికి మరో గట్టి దెబ్బ తగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తతో విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో ఫ్యాన్స్‌, సన్నిహితులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తన విడాకుల గురించి శ్వేతబసు ప్రసాద్ ఏమని పోస్టు చేశారంటే..

  రోహిత్ మిట్టల్‌తో ప్రేమ వివాహం

  రోహిత్ మిట్టల్‌తో ప్రేమ వివాహం

  కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్వేతబసు ప్రసాద్ గత రెండేళ్లుగా రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. గత డిసెంబర్‌లో వారిద్దరు పెళ్లి చేసుకొన్నారు. అయితే వారి జీవితంలో విభేదాలు చోటుచేసుకోవడంతో ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. తన వైవాహిక జీవితంలో చోటు చేసుకొన్న విషయాల గురించి ట్విట్టర్‌లో స్పందించారు.

   పరస్పర విడిపోవాలనుకొంటున్నాం

  పరస్పర విడిపోవాలనుకొంటున్నాం

  నా స్నేహితులు, సన్నిహితులు, అభిమానులతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకొంటున్నాను. రోహిత్ మిట్టల్‌ (భర్త), నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకొన్నాం. మా వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకొన్నాం. కొద్ది నెలలుగా ఈ విషయంపై తర్జనభర్జన పడ్డాం. కష్టమైనా మా ఇద్దరి భవిష్యత్ కోసం తుది నిర్ణయానికి వచ్చాం అని శ్వేత బసు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  నా పెళ్లి గురించి

  నా పెళ్లి గురించి

  పెళ్లి గురించి పుస్తక పఠనాన్ని పోల్చుతూ ఓ విషయాన్ని వెల్లడించారు. ప్రతీ పుస్తకాన్ని కవర్ నుంచి కవర్ వరకు చదవలేం. అలాగని ఆ పుస్తకం బాగాలేదని కాదు. కొన్ని సందర్భాల్లో పూర్తి చేయడానికి కుదరదు. అందుకే అర్ధాంతరంగా దానిని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా పెళ్లి విషయంలో కూడా అలాంటిదే జరిగింది అని శ్వేతాబసు ట్విట్టర్‌లో తెలిపారు.

  భర్తపై ప్రశంసల వర్షం

  అలాగే భర్త రోహిత్‌పై శ్వేతబసు ప్రశంసల వర్షం కురిపించారు. నా జీవితంలో మరిచిపోలేనటువంటి మధురానుభూతులను పంచినందుకు రోహిత్‌కు థ్యాంక్స్. ప్రతీ సందర్భంలో నాకు స్ఫూర్తిగా నిలిచావు. ఇక మీ భవిష్యత్ అంతా బాగుండాలని కోరుకొంటున్నాను. మిమల్ని ప్రోత్సహించే చీర్‌ లీడర్‌గా ఉంటాను అని శ్వేతబసు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  శ్వేతబసు కెరీర్ ఇలా..

  శ్వేతబసు కెరీర్ ఇలా..

  శ్వేతబసు ప్రసాద్ బాలనటిగా 2002లో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మక్డీ అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. కహానీ ఘర్ ఘర్ కీ, కరిష్మా కా కరిష్మా సీరియల్స్ నటించారు. నాగేష్ కుకునూర్ చిత్రం ఇక్బాల్‌లో నటించారు. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత రైడ్, కలావర్ కింగ్, రా రా, ప్రియుడు, చందమామ చిత్రాల్లో నటించారు. తాజాగా బద్రీనాథ్ కి దుల్హనియా, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, ది తాష్కెంట్ ఫైల్స్ అనే చిత్రంలో నటించారు.

  English summary
  Shweta Basu Prasad and Rohit Mittal couple are parted ways. She tweeted that Rohit Mittal and I have mutually decided to part our ways and end our marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X