Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి, ఎందుకు ఇంత రహస్యంగా? (ఫోటోస్ లీక్)
తెలుగులో హీరోయిన్గా కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హిందీ టీవీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటూ తన కెరీర్ కొనసాగిస్తోంది.
కొంతకాలంగా శ్వేతా బసు, ఆమె బాయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్ మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. 2017లోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నేడు(డిసెంబర్ 13) ఈ ప్రేమ పక్షులు పెళ్లి ద్వారా ఏకం కాబోతున్నారని, మార్వాడి, బెంగాళీ సాంప్రదాయంలో పూణె వేదికగా వీరి వివాహం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ దర్శకుడి వల్లే పరిచయం
శ్వేతా బసు ప్రసాద్, రోహిత్ మిట్టల్ ఐదేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్నారు. వీరి మధ్య పరిచయం ఏర్పడటానికి కారణం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, వీరి రిలేషన్ఫిప్ను కూడా ఆయన ఎంకరేజ్ చేశారని గతంలో వార్తలు వినిపించాయి. అప్పట్లో శ్వేతా బసు అనురాగ్ కశ్యప్ దగ్గర పని చేసిన సంగతి తెలిసిందే.
పెళ్లి గురించి స్పందించడానికి ఇష్టపడని శ్వేతా బసు
అయితే తమ పెళ్లి విషయాన్ని శ్వేతా బసు ప్రసాద్, రోహిత్ మిట్టల్ అధికారికంగా వెల్లడించలేదు. ఇది తన పర్సనల్ విషయమని, దీని గురించి తాను మీడియాతో మాట్లాడదలుచుకోలేదని శ్వేతా బసు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ చూస్తుంటే పెళ్లి విషయం కావాలనే సీక్రెట్‌గా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
బెంగాళీ సాంప్రదాయంలో
పెళ్లికి ముందు బెంగాళీ సాంప్రదాయంలో నిర్వహించే బ్రైడల్ షవర్ పార్టీ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో శ్వేతా బసు సాంప్రదాయ బెంగాళీ రెడ్ బోర్డర్ సారీ ధరించి కనిపించారు. మెహందీ సెర్మీనీ కూడా అదే రోజు నిర్వహించినట్లు తెలుస్తోంది.
పూణె గ్రాండ్ హయత్ హోటల్
పూణెలోని గ్రాండ్ హయత్ హోటల్లో శ్వేతా బసు, రోహిత్ మిట్టల్ పెళ్లి వేడుక జరుగుతున్నట్లు సమాచారం. శ్వేతా బసు ప్రసాద్ సన్నిహితులు, అభిమానులు వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెళ్లి విషయం లీక్ చేశారు.