twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మ్యూజిక్ డైరెక్టర్‌కు మీటూ సెగ.. సిగ్గుచేటు అంటూ మండిపడుతున్న సింగర్స్

    |

    మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ మరోసారి మీడియాలోకి ఎక్కారు. అను మాలిక్‌ను సమర్ధించిన గాయని హేమ సర్దేశాయ్‌ను టార్గెట్ చేస్తూ పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సింగర్ శ్వేత పండిట్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అనుమాలిక్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడంపై హేమ సర్ధేశాయ్‌పై దుమ్మెత్తి పోశారు. వివరాల్లోకి వెళితే..

    అనుమాలిక్‌కు మరోసారి మీటూ సెగ

    అనుమాలిక్‌కు మరోసారి మీటూ సెగ

    గతేడాది మీటూ ఉద్యమంలో బాధితులుగా మారిన వారిలో మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ ఒకరు. పలువురు చేసిన ఆరోపణలతో ఇండియన్ ఐడల్ కార్యక్రమం నుంచి అనుమాలిక్‌ను తప్పించారు. అయితే మీటూ ఉద్యమం తగ్గిపోవడంతో అను మాలిక్‌ను ఆ కార్యక్రమానికి మళ్లీ హోస్ట్‌గా నియమించారు. అయితే తాజాగా నేహా భాసిన్ అనే గాయని ఆరపోణలు చేయడంతో మల్లీ అను మాలిక్‌ వివాదంలో కూరుకూపోయారు. అయితే ఈ క్రమంలో ఆయనను సమర్ధిస్తూ హేమ సర్దేశాయ్ కామెంట్ చేశారు.

    అను మాలిక్‌కు మద్దతిచ్చిన గాయని

    అను మాలిక్‌కు మద్దతిచ్చిన గాయని

    కొద్ది రోజుల క్రితం గాయని హేమ సర్దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నేను ఎంతో శ్రమపడ్డాను. నైతిక విలువలను వదులుకోలేక కెరీర్‌ను నాశనం చేసుకోవడానికైనా తెగించాను. అప్పుడు నాకు ఎవరూ అండగా నిలువలేదు. అలా ఎన్నో ఏళ్లుగా బ్రేక్ కోసం ఎదురు చూశాను. అలాంటి సమయంలో అను మాలిక్ నాకు అవకాశాలు ఇచ్చారు. నేను పాటలు బ్లాక్ బస్టర్లుగా మారాయి. ఆయన వల్లే నాకు ఈ గుర్తింపు అని అన్నారు.

    హేమ సర్దేశాయ్‌పై శ్వేత పండిట్ ఫైర్

    హేమ సర్దేశాయ్‌పై శ్వేత పండిట్ ఫైర్

    అలా అనుమాలిక్‌కు హేమ సర్దేశాయ్ మద్దతు తెలుపడంపై శ్వేత పండిట్ స్పందించారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమాలిక్ ఎలా సపోర్ట్ చేస్తావు? ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రకటన చేయడం సిగ్గుచేటు. ఒక మహిళగా అలా వ్యవహరిస్తావా? నీకు బాధితులపట్ల ఏమాత్రం దయ లేదు. అసలు లైంగిక వేధింపులకు గురైన వారంటే నీకు పట్టింపే లేదు అని శ్వేత పండిట్ పేర్కొన్నారు.

    సోనా మహాపాత్ర గరం గరం

    సోనా మహాపాత్ర గరం గరం

    హేమ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ సోనా మహాపాత్ర ట్విట్టర్‌లో స్పందించారు. ఎవరైనా సర్దేశాయ్‌కి చెప్పండి. లైంగిక దాడికి గురైన బాధితురాలిని కించపరిచే విధంగా మాట్లాడటం తగదు. అందుకే మైనర్లు, రేప్ బాధితుల గురించి వారి కుటుంబాలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. నీలాంటి వాళ్లు ఇంకా ఉండటం వల్లే పరిస్థితి ఇలా ఉంది. నిన్ను చూస్తూ ఓ మానసిక రోగిలా... ఓ చెత్త మహిళగా కనిపిస్తున్నావు అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Music Director Anu Malik once again in the news for MeeToo Movement. Singers Shweta Pandit and Sona Mohapatra slams Hema Sardesai, Who supported Anu Malik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X