దేవుడు మీద అనుచిత వ్యాఖ్యలు.. నేనలా అనలేదు.. అసలు విషయమిదంటూ శ్వేత తివారీ ప్రకటన !
టీవీ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వివాదాస్పద ప్రకటన కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటిపై పోలీసు కేసు కూడా నమోదైంది. శ్వేత తన వెబ్ సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో, మాట్లాడుతూ - దేవుడు నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు అంటూ సంచలన ప్రకటన చేసింది. ఆమె ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో, నటి తన వివరణ తెలియజేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఆమె క్షమాపణలు చెప్పారు. ఆ వివరాలు

భగవంతుడిపై జోక్ చేస్తూ
హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హిందూత్వవాదులు డిమాండ్ చేస్తుండగా మరో పక్క ఆమె మీద పోలీస్ కేసు కూడా నమోదయింది. శ్వేతా తివారీ తాజాగా నటించిన వెబ్ సిరీస్ షో స్టాపర్. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి భోపాల్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ ఆయన తన బ్రా సైజ్ తీసుకుంటున్నాడు అని ఆమె పేర్కొంది.

విచారణ జరపాలని
ఇక ఆమె మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నెటిజన్లు నటిని దుమ్మెత్తిపోశారు. చాలా చోట్ల ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. 'శ్వేతా తివారీ నుంచి ఆ మాటలు రావడం నేనే స్వయంగా విన్నాను. ఇది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దీనిపై విచారణ జరపాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని పేర్కొన్నారు.

మౌనాన్ని వీడి
ఇదంతా వివాదంగా మారడంతో శ్వేత ఈ విషయంపై తన మౌనాన్ని వీడింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు నటి క్షమాపణలు కూడా చెప్పింది.ఎవరి మత మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని శ్వేత తెలిపింది. తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని నటి చెప్పింది. మీడియా అనే విషయాలను వంకరగా ప్రజెంట్ చేస్తుందని వెల్లడించింది. తాను స్వయంగా దేవుణ్ణి చాలా నమ్ముతుంది కాబట్టి ఆయన్ను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం లేదని పేర్కొంది.

ఉదాహరణగా చెప్పా
ఆమె తన స్టేట్‌మెంట్‌లో నా సహనటుడు గతంలో చేసిన పాత్రను దృష్టిలో ఉంచుకుని, చేసిన కామెంట్స్ ను తప్పుగా తీసుకుంటున్నారని నాకు తెలుసని ఆమె పేర్కొంది. 'భగవాన్' అంటూ నేను చేసిన కామెంట్స్ అన్నీ సౌరబ్ రాజ్ జైన్ గతంలో ప్రముఖ దేవుడి పాత్రకు సంబంధించిన పోషించిన విషయాన్ని ప్రస్తావించాను. జనాలు అందరూ వ్యక్తులు పాత్రల పేర్లను నటీనటులను గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉదాహరణగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.
Recommended Video

క్షమాపణలు కోరుతున్నా
"అయితే, ఈ ప్రకటన పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోబడింది, ఇది విచారకరం. స్వతహాగా 'దేవుని'పై అపారమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఏదీ తెలిసి, తెలియక చేయను, చెప్పను. అయితే సందర్భం లేకుండా ఈ మాట వినడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అర్థమైంది. దయచేసి నన్ను నమ్మండి, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ లేదు. అందువల్ల, నా ప్రకటన ద్వారా అనుకోకుండా నేను బాధ పెట్టిన వారికి నేను వినమ్రంగా క్షమాపణలు కోరుతున్నాను. మరి ఇప్పుడు శ్వేత క్షమాపణ చెప్పిన తర్వాత వ్యవహారం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











