ప్రియాంక చోప్రా సోదరుడి వివాహం.. ఊహించని ఘటనతో ఆసుపత్రి బాట!
అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా... కొన్ని రోజుల క్రితమే ఇండియా వచ్చారు. అందుకు కారణం తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుక ఉండటమే. గత వారాంతమే వివాహ వేడుక జరుగాల్సి ఉండగా ఊహించని పరిణామాలతో పెళ్లి వేడుక వాయిదా పడింది. అందరూ ఆసుపత్రి బాట పట్టారు.
సిద్ధార్థ్ చోప్రా పెళ్లాడబోతున్న ఇషితా కుమార్‌కు ఆరోగ్య సమస్య వల్ల ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చిందట. దీంతో పెళ్లి వేడుక ముందుగా అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయారు. అయితే బయట మాత్రం వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది.

పెళ్లి రద్దు కాలేదు
ఓ ఆంగ్లపత్రికతో చోప్రా కుటుంబ సన్నిహితులు మాట్లాడుతూ సిద్ధార్థ్, ఇషితా కుమార్ పెళ్లి వాయిదా పడలేదని స్పష్టం చేశారు. ఇషితకు అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం అయినందు వల్ల కొన్ని రోజుల పాటు వివాహాన్ని వాయిదా వేశారని తెలిపారు

కొత్త ముహూర్తం కోసం...
ప్రస్తుతం ఇషిత కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సర్జరీ పూర్తయిన తర్వాత ఆమె రికవరీ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొత్త ముహూర్తం నిర్ణయించి వివాహ వేడక నిర్వహించబోతున్నారు.

ఆసుపత్రి ఫోటోలు షేర్ చేసిన ఇషిత
మాక్స్ స్మార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇషిత కుమార్‌కు సర్జరీ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘సర్జరీ నుంచి కోలుకుంటున్నాను. చాలా బాధగా ఉంది, కానీ ఈ సర్జరీ పూర్తయినందుకు ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు.

తిరిగి అమెరికా వెళిపోయిన ప్రియాంక
పెళ్లి వాయిదా పడటంతో ప్రియాంక చోప్రా తిరిగి అమెరికా వెళ్లారు. యూఎస్ఏలో పూర్తి చేయాల్సిన తన పర్సనల్ పనులు, ప్రొఫెషనల్ పనులు పెండింగులో ఉండటంతో వాటిని పూర్తి చేసుకుని మళ్లీ పెళ్లి జరిగే సమయానికి తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











