సుశాంత్ మృతికి ముందు రియా ఏం చేసిందంటే.. సీబీఐతో గుట్టువిప్పిన సిద్ధార్థ్ పితాని!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు జరిగిన కీలక సంఘటనలను సీబీఐ అధికారులకు ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పితాని వెల్లడించినట్టు తెలుస్తున్నది. సీబీఐ విచారణలో పితాని పలు విషయాలను చెప్పినట్టు జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ సంచలన కథనాన్ని ప్రచురించింది. దిశ మరణం తర్వాత సుశాంత్‌కు ఎదురైన సంఘటనలను సీబీఐకి వెల్లడించినట్టు తమ కథనంలో పేర్కొన్నది. జాతీయ ఛానెల్ వెల్లడించిన కథనాల ప్రకారం..

నా ప్రాణాలకు ముప్పు ఉందని

నా ప్రాణాలకు ముప్పు ఉందని

దిశ మరణ వార్త వినగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్పృహ కోల్పోయారు. ఆ షాక్ నుంచి తేరుకొన్న తర్వాత తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పారు. రియా చక్రవర్తి తనను ఎదో విధంగా సమస్యల్లో ఇరికించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దిశ మరణం తర్వాత చాలా భయాందోళనకు లోనయ్యాడు అని సీబీఐ విచారణలో సిద్ధార్థ పితాని చెప్పినట్టు సమాచారం.

ల్యాప్‌టాప్, డిస్క్‌లను తీసుకొని

ల్యాప్‌టాప్, డిస్క్‌లను తీసుకొని

దిశ మరణం తర్వాత సుశాంత్ సింగ్‌తో రియా చక్రవర్తి గొడవ పడ్డారు. ఆ తర్వాత ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయారు. రియా వెళ్లిపోయిన తర్వాత నన్ను కూడా చంపుతారేమో అనే భయానికి లోనయ్యారు. తనకు సెక్యూరిటీ మరింత కావాలనే విషయాన్ని చెప్పారు. రియా వెళ్లిపోయిన తర్వాత సుశాంత్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని సీబీఐకి సిద్ధార్థ్ చెప్పినట్టు రిపబ్లిక్ టీవీ కథనాన్ని వెల్లడించింది.

అకౌంట్ల పాస్‌వర్డ్స్‌పై సుశాంత్ కంగారు

అకౌంట్ల పాస్‌వర్డ్స్‌పై సుశాంత్ కంగారు

సుశాంత్, రియా చక్రవర్తి లాక్‌డౌన్‌లో సహజీవనం చేశారు. దిశ సలియాన్ మరణం సమయంలో అంటే జూన్ 8వ తేదీన సుశాంత్ నుంచి తన ఇంటికి వెళ్లిపోయారు. రియా వెళ్లిపోయిన తర్వాత తన ఎలక్ట్రానికి వస్తువులను తీసుకొని వెళ్లిపోవడంతో కంగారు పడ్డారు. తన అకౌంట్లకు సంబంధించిన పాస్‌వర్డ్స్‌ తనకు తెలియడంతో మరింత ఆందోళనకు గురయ్యారనే విషయం తాజా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం.

సిద్దార్థ పితానిని విచారిస్తున్న సీబీఐ

సిద్దార్థ పితానిని విచారిస్తున్న సీబీఐ

దిశ మరణం తర్వాత సుశాంత్ మృతి చోటుచేసుకోవడంతో ఆ రెండు మరణాల మధ్య ఏదైనా లింకు ఉందా అనే కోణంలో సీబీఐ విచారిస్తున్నది. ఈ క్రమంలో ఆ రాత్రి సుశాంత్‌ ఇంట్లో ఉన్న సిద్దార్థ్ పితానిని సీబీఐ పలుమార్లు విచారిస్తున్నది. ఈ క్రమంలో సుశాంత్ ఇంటిలో సూసైడ్ సీన్ రీక్రియేట్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ పితాని గురించి

హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ పితాని గురించి

హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ పితాని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోషల్ మీడియా టీమ్‌లో చురుకుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా సుశాంత్ నివాసంలో ఉంటూ వస్తున్నారు. జూన్ 14వ తేదీన సుశాంత్ మరణించే సమయానికి సిద్దార్థ్ పితాని ఆయనతోనే ఉన్నారు. ఈ క్రమంలో పితానిని ముంబై పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీ లాంటి దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X