Sidharth Kiara Net Worth: కియారా- సిద్ధార్ధ్ సంపద ఎన్ని వందల కోట్లంటే? ఇద్దరిలో టాప్ ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్ధ్ మల్హోత్రా- కియారా అద్వానీలు తల్లిదండ్రులుగా ప్రమోషన్ సాధించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ జూలై 15వ తేదీని ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఇరు కుటుంబాల్లోనూ సంతోషం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. కియారా దంపతులు తమ బిడ్డకు ఏ పేరు పెట్టారు? పాప ఎలా ఉంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పాప ఫోటోలు తీయొద్దు
బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కియారా దంపతులు మీడియాకు, తమ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. పాప ఫోటోలు, వీడియోలు తీయొద్దని వారు కోరారు. ఈ అద్భుతమైన సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటున్నామని, అందుకే ఫోటోలు షేర్ చేయడం లేదని కియారా పేర్కొన్నారు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నామని కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రా దంపతులు రిక్వెస్ట్ చేశారు. బాలీవుడ్‌లోని ఇతర స్టార్స్ మాదిరిగానే కియారా- సిద్దార్ధ్‌లు కూడా తమ బిడ్డ ఫోటోను అప్పుడే రివీల్ చేయడం ఎందుకనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రెండేళ్ల తర్వాత ప్రెగ్నెంట్
ఇకపోతే.. షేర్షా సినిమా సమయంలో కియారా అద్వానీ- సిద్ధార్ధ్ మల్హోత్రా జంట ప్రేమలో పడింది. కొన్నాళ్లు తమ బంధాన్ని సీక్రెట్‌గా ఉంచినప్పటికీ ఓ రోజున సడెన్‌గా తాము ప్రేమలో పడినట్లు, రిలేషన్‌లో ఉన్నట్లు ఈ జోడీ రివీల్ చేసింది. పెద్దల అంగీకారంతో 2023 ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ సినిమాలలో నటిస్తూనే వచ్చారు. సిద్ధార్థ్ కూడా బిజీ అయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వీరిద్దరూ ప్రకటించారు. తాజాగా రెండ్రోజుల క్రితం కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
కియారా ఆస్తి ఎంత?
ఇదిలాఉండగా కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రాల ఆస్తి ఎంత? ఒక సినిమాకు ఈ జంట ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ వివరాలపై ప్రస్తుతం చిత్రసీమలో చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని సంపన్న జంటల్లో కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రాల జోడీ కూడా ఒకటి. కియారా అద్వానీ హిందీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. సినిమాకు 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు కియారా అద్వానీ. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు కియారా అద్వానీ. ఆమె ఆస్తుల విలువ రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
సిద్ధార్ధ్ మల్హోత్రా సంపద ఎంత?
ఇక సిద్ధార్ధ్ మల్హోత్రా ఆస్తుల గురించి పరిశీలిస్తే.. సినిమాకు రూ.15 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాగే ఒక్కో బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌కు రూ. 2 నుంచి రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటారు. సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాలతో ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నారు సిద్ధార్ధ్. మొత్తంగా సిద్దార్ధ్ ఆస్తుల విలువ రూ.110 కోట్ల పైనే ఉంటుందని బాలీవుడ్ టాక్. వీరిద్దరూ ముంబైలో సముద్రానికి అభిముఖంగా ఉన్న లగ్జరీ విల్లాలో నివసిస్తున్నారు. దీని విలువ రూ.70 కోట్ల పైనే ఉంటుందట. అలాగే 15 కోట్ల విలువ చేసే మహాలక్ష్మీ అపార్ట్‌మెంట్ కూడా వీరి పేరిట ఉంది. బీఎండబ్ల్యూ ఎక్స్ 5, ఆడీ ఏ 8ఎల్, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ వంటి లగ్జరీ కార్లు వీరి గ్యారేజ్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











