నా బ్రేకప్‌కు కారణం అదే.. అలా జరిగిపోయింది.. తప్పెవరిదంటే!

ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రూపొందించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా షూటింగ్ సందర్బంగా అలియా, సిద్ధార్థ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అఫైర్ సజావుగా ముందుకెళ్తుందనుకొన్న నేపథ్యంలో తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అలియాతో బ్రేకప్‌కు సంబంధించిన కారణాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే..

 అలియా భట్‌తో బ్రేకప్

అలియా భట్‌తో బ్రేకప్

వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాల వల్ల అలియాతో బ్రేకప్ జరిగింది. అప్పటి నుంచి మేమిద్దరం మళ్లీ కలుసుకోలేదు. అలా అని మా మధ్య ఎలాంటి కోపతాపాలు, ద్వేషం లేదు. మంచి సంబంధాలే ఉన్నాయి. నేను డేటింగ్ చేయడానికి ముందే నాకు అలియాతో మంచి పరిచయం ఉంది అని సిద్ధార్థ్ చెప్పారు.

మా మధ్య దూరం పెరుగడానికి

మా మధ్య దూరం పెరుగడానికి

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో నేను సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. నా తొలి సన్నివేశం అలియాతోనే చిత్రీకరణ జరిగింది. అది నాకు మరిచిపోలేని ఓ మెమొరీ. నా జీవితంలో గుర్తుంచుకొనే రోజుల్లో అది ఒకటి అని సిద్ధార్థ్ అన్నారు. కానీ బయటకు వెల్లడించలేని కారణాల వల్ల మా మధ్య దూరం పెరిగింది. అని చెప్పారు.

అలియాభట్‌ తప్పులేదు

అలియాభట్‌ తప్పులేదు

అలియాభట్ కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకొన్నది. తన ప్రొఫెషనల్ జీవితాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలని భావించింది. అదే విషయంపై మేము మా రిలేషన్‌ను ముందుకు కొనసాగించలేకపోయాం. మేము విడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒక కారణం. అందుకే మిమిద్దరం కలిసి ఉండొద్దని నిర్ణయించుకొన్నాం. అయితే విడిపోవడానికి తప్పు ఎవరివైపు లేదు అని సిద్ధార్థ్ మల్హోత్రా వెల్లడించాడు

 జీవితంలో ఒడిదుడుకులు సహజం

జీవితంలో ఒడిదుడుకులు సహజం

అలియాతో బ్రేకప్ వల్ల నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. చాలా రోజులు ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోయాను. ప్రతీ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సి ఉంటుందని స్వయంగా నా మనసును నేను కుదుటపరుచుకొన్నాను. అలియాతో నా బంధం మాత్రం నాకు చాలా తీపిగుర్తులను, సంతోషకరమైన సంఘటనలను మిగిల్చింది అని సిద్ధార్థ్ కపూర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X