వర్షంలో ఆ నటితో రొమాన్స్ .. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన స్టార్ హీరోయిన్ భర్త
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నార్త్, సౌత్ తేడా లేకుండా వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్దిలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. హిందీలోనూ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రియుడు శిఖర్ పహారియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా ఈ ఏడాదిలోనే జాన్వీ పెళ్లి పీటలెక్కుతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలాంటి దశలో ఓ హీరోతో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
విడుదలకు సిద్ధమైన పరమ్ సుందరి
పెద్దితో పాటు హిందీలో పరమ్ సుందరి అనే సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఛావా వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను నిర్మించిన మద్దూక్ ఫిల్మ్స్ అధినేత దినేజ్ విజాన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. తుషార్ జలోటా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. శాంతాన కృష్ణన్, రవిచంద్రన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. సచిన్ - జిగర్ జోడీ స్వరాలు సమకూరుస్తోంది. వచ్చే నెల 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గత నెలలో విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

కొత్తగా జాన్వీ కపూర్
కేరళ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ సినిమాగా పరమ్ సుందరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే ఇందులో జాన్వీ కపూర్ మలయాళీగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీజర్ చివరిలో ఎర్ర చీరలో జాన్వీ కపూర్ వేట కొడవలి పట్టుకుని రావడం షాక్‌కు గురిచేసింది. ఇందులో జాన్వీ నటన, కామెడీ హైలైట్‌గా నిలుస్తాయని.. ఇప్పటి వరకు చూడని కోణంలో జాన్వీ నటన ఉంటుందని అంటున్నారు. రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నట్లుగా బాలీవుడ్ టాక్.
నార్త్ అబ్బాయికి- సౌత్ అమ్మాయికి ప్రేమ
తొలి నుంచి క్రాస్ కల్చర్ రొమాంటిక్ డ్రామాగా పరమ్ సుందరిని సినిమా ఉంటుందని చెబుతున్నారు. నార్త్ అబ్బాయి- సౌత్ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమకథగా భావిస్తున్నారు. గతంలో ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన షారుఖ్ ఖాన్- దీపిక పదుకొణెల చెన్నై ఎక్స్‌ప్రెస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాను దర్శకుడు ఫాలో అవుతున్నాడా అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. కేరళలోని అందమైన లోకేషన్‌లలో పరమ్ సుందరి సినిమా షూటింగ్ జరుపుకుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే పరమ్ సుందరి ట్రైలర్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జాన్వీతో సెట్‌లో సిద్ధార్ధ్ అలా
ఇకపోతే పరమ్ సుందరి సెట్‌లో జాన్వీ కపూర్- సిద్ధార్ధ్ మల్హోత్రాల కెమెస్ట్రీ కొత్త అనుమానాలకు తావిస్తోంది. సరదాగా అందరినీ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సిద్ధార్ధ్.. సెట్‌లో అల్లరి చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో, ఫోటో సెషన్ కోసం జాన్వీ, సిద్ధార్థ్‌లు బయటికి వస్తారు. ఎరుపు రంగు చీరలో కాలికి గజ్జెలు కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని జాన్వీ కపూర్ అందంగా రెడీ అయ్యారు. ఫోటోలు తీస్తుండగా చిరు జల్లులు పడటాన్ని గమనించిన సిద్ధార్ధ్ మల్హోత్రా.. జాన్వీ తడవకుండా ఆమె తలపై తన రెండు చేతులు అడ్డుపెట్టారు. దాంతో సిగ్గుపడిన జాన్వీ అతనిని సరదాగా కొట్టి లోపలికి వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ మరోసారి ఈ ఇద్దరూ ఫోటోలకు ఫోజులిస్తారు.
జాన్వీ- సిద్ధార్ధ్ కెమిస్ట్రీపై రూమర్స్
ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హీరోయిన్‌ను ఎంత హీరోగా చూసుకుంటున్నారు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఇదేదో తేడాగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అన్నట్లు ఈ సిద్ధార్ధ్ మల్హోత్రా ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ భర్త. ఇటీవలే ఈ జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించింది. కియారా ప్రస్తుతం వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











