For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Siddarth Shukla Death: కోట్ల ఆదాయం, షాకింగ్ రెమ్యునరేషన్.. అనుభవించే సమయంలోనే ఇలా..

  |

  హిందీలో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన చనిపోయినట్లు తెలియగానే సినీ ప్రముఖులు అలాగే అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అతని వయస్సు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే. ఇక హార్ట్ ఎటాక్ రావడంతోనే సిద్దార్థ్ మరణించాడని చెప్పారు. ఇక ప్రస్తుతం నేషనల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా అతని మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పాజిటివ్ గా కనిపించే సిద్దార్థ్ కెరీర్ సెట్ చేసుకోవడం కోసం ఇన్నేళ్ళు చాలానే కష్టపడ్డాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆస్తులు, రెమ్యునరేషన్ కు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్దార్థ్ ఎంతో కష్టపడి మంచి ఆదాయాన్ని సెట్ చేసుకున్నాడు. సరిగ్గా అనుభవించే సమయంలోనే అతను తనువు చాలించాడు.

  అనుమానాలు రాకముందే

  అనుమానాలు రాకముందే


  ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉండే సిద్దార్థ్ శుక్లా ఇలా హఠాత్తుగా తనువు చాలించడం అభిమానులకు అంతు చిక్కడం లేదు. ఇక అతని మరణం వెనుక అనుమానాలు ఎక్కువ కాకముందే హాస్పిటల్ వైద్యులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ముందే ఒక క్లారిటీ ఇచ్చేశారు. గుండెపోటు రావడంతోనే సిద్దార్థ్ మరణించినట్లు చెప్పారు. తీవ్రంగా నొప్పి రావడంతో ఇటీవల హుటాహుటిన కూపర్ ఆసుపత్రికి తరలించగా అక్కడే మరణించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. అలాగే తల్లి ఇద్దరు సోదరీమణులు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

  టాలెంటెడ్ యాక్టర్.. మంచి వ్యక్తిగా..

  టాలెంటెడ్ యాక్టర్.. మంచి వ్యక్తిగా..


  సిద్దార్థ్ శుక్లా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ అందుకుంటూ వచ్చాడు. వ్యక్తిత్వంలో కూడా అతను చాలా మంచివాడు అని చాలామంది అంటుంటారు. ఇక ఇటీవల బిగ్ బాస్ OTT, అలాగే డాన్స్ దీవానే 3 వంటి రియాలిటీ షోలలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తన స్నేహితురాలు షెహ్నాజ్ గిల్‌తో కూడా కనిలించాడు. ఇక చాలా తక్కువ కాలంలోనే ఈ వార్త అతని అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది.

  చివరగా అందులోనే..

  చివరగా అందులోనే..

  బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ హంప్టీ శర్మ కి దుల్హనియా చిత్రంలో కూడా నటించాడు. ఇక ఈ నటుడు చివరిగా ఏక్తా కపూర్ 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3' లో అగస్త్య అనే పాత్రలో నటించాడు. దాంతో మరోసారి మంచి గుర్తింపును అందుకున్నడు. సిద్దార్థ్ శుక్లా కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా నలిగురికి సహాయం చేసే మంచి వ్యక్తిగా కూడా బుల్లితెర ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. లాక్ డౌన్ లో కూడా అతను చాలామంది పేద వారికి సహాయం చేశాడు.

  రెమ్యునరేషన్ ఎంతంటే

  రెమ్యునరేషన్ ఎంతంటే

  సిద్దార్థ్ శుక్లా మరణించాడు అనగానే ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా ఈ న్యూస్ వైరల్ అయ్యింది. ఎందుకంటే హిందీ వరల్డ్ లో అతనికున్న క్రేజ్ అలాంటిది. ఇక అతని నెలసరి ఆదాయం కూడా గట్టిగానే ఉంటుందట. రియాలిటీ షోలు చేసిన లేదా బుల్లితెరపై ఎలాంటి ఎంటర్టైన్మెంట్ షో చేసినా కూడా సిద్దార్థ్ శుక్లా నెలకు 10 లక్షల జీతం అందుకుంటాడట. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అనంతరం అతని స్థాయి అనుకున్న దానికంటే ఎక్కువగానే పెరిగింది.

  Recommended Video

  Sohel Fun With House Arrest Movie Kids..నవ్వులే నవ్వులు
  గతంలో కంటే భారీగా ఆదాయం..

  గతంలో కంటే భారీగా ఆదాయం..

  అలాగే మరికొన్ని సార్లు ఒక్క కమిట్మెంట్ కోసం కోటి రూపాయలకు పైగా జీతాన్ని అందుకున్న సందర్బాలు కూడా చాలానే ఉన్నాయట. ఆ లెక్కన చూస్తే అతని నికర విలువ 8.80కోట్లు ఉంటుందని సమాచారం. బిగ్ బాస్ అనంతరం సిద్దార్థ్ కెరీర్ ను ఒక సరైన ట్రాక్ లోనే సెట్ చేసుకున్నాడు. తనకు నచ్చిన కారును కొనుక్కోవడమే కాకుండా ఖరీదైన ఫ్లాట్ ను కూడా తీసుకున్నాడు. ఇక అంత సవ్యంగా సాగిపోతుందని అనుకున్న సమయానికి అతను తనువు చాలించడం కుటుంబ సభ్యులను అభిమానులను కలచి వేసింది.

  English summary
  Sidharth Shukla 2021: Net Worth, Assets, Luxury Cars And Other Details,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X