twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Siddharth Shukla: విషాదంతో కోమాలోకి లేడీ ఫ్యాన్.. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉండగా!

    |

    సిద్ధార్థ్ శుక్లా గురువారం ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పాడు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని చెబుతున్నారు. గురువారం ఉదయం, నటుడి కుటుంబం అతడిని కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే వైద్యులు హాస్పిటల్ కు తీసుకు రాక ముందే చనిపోయాడు' అని ప్రకటించారు. ఈ వార్త తర్వాత, దేశవ్యాప్తంగా అతని అభిమానుల్లో విషాదం నెలకొంది. నటుడి మరణంతో టీవీ పరిశ్రమ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఒక అభిమాని కోమాలోకి వెళ్లిపోయాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సిద్ధార్థ్ కుటుంబంతో పాటు, అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల, సిద్ధార్థ్ శుక్లా కోసం ఒక అమ్మాయి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మరువక ముంచే ఇప్పుడు ఒక మహిళా అభిమాని పాక్షిక కోమాలోకి వెళ్లిపోయారని అంటున్నారు.

    అపస్మారక స్థితిలో

    అపస్మారక స్థితిలో

    అందుతున్న సమాచారం మేరకు ఈ సిద్ధార్థ్ శుక్లా అభిమానిని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చారు. ఆమె బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సిద్ధార్థ్ శుక్లా స్నేహితుడు మరియు వైద్యుడు జయేశ్ థాకర్ ట్విట్టర్‌లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన ఆసుపత్రిలో చేరిన ఒక మహిళా అభిమాని చిత్రాన్ని షేర్ చేసి 'సిద్నాజ్' అభిమానులను ఒంటరిగా ఉండవద్దని, కుటుంబ సభ్యులతో మాట్లాడటం కొనసాగించాలని అభ్యర్థించాడు.

    Recommended Video

    Sidharth Shukla Biography ఆ రాత్రి ఏం జరిగింది.. ప్రేయసి గుండెబద్ధలు || Filmibeat Telugu
     జయేశ్ ఠాకర్ ట్వీట్

    జయేశ్ ఠాకర్ ట్వీట్

    అభిమానులకు విన్నపం - ఒంటరిగా ఉండకండి , కుటుంబంతో మాట్లాడుతూ ఉండండి అని ఆయన అన్నారు. జయేశ్ ఠాకర్ ట్వీట్ చేస్తూ, ఇక మహిళా అభిమాని పాక్షిక కోమాలో ఉన్నారని డాక్టర్ చెప్పారు. అధిక ఒత్తిడి కారణంగా ఆమె అవయవాలలో కదలిక లేదని అందుకే ప్రతి అభిమాని ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎక్కువగా ఆలోచించవద్దు. ఇది అంత సులభం కాదని నాకు తెలుసు కానీ మీరు సిద్ధార్థ్‌ ఆత్మను శాంతంగా ఉంచాలని అన్నారు.

     ఒంటరిగా ఉండకండి

    ఒంటరిగా ఉండకండి

    మరొక ట్వీట్‌లో, 'దయచేసి మీరందరూ మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఒంటరిగా ఉండకండి అని పేర్కొన్నారు, ఇక సెప్టెంబర్ 2 న సిద్ధార్థ్ గుండెపోటుతో మరణించారు, ఆయన మరణవార్త మొత్తం సినిమా మరియు టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సిద్ధార్థ్ ఈ ప్రపంచంలో లేడని ఎవరూ నమ్మలేక పోతున్నారు. మరో పక్క అతని ప్రేయసిగా చెబుతున్న షహనాజ్ గిల్ అపస్మారక స్థితికి చేరుకున్నారు.

    కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌

    కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌


    గురువారం మధ్యాహ్నం 3.45గంటలకు సిద్ధార్థ శుక్లా డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియో షూట్ చేశారు. సున్నితమైన కేసు కావడమే కాక గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దృష్టిలో ఉంచుకుని... ప్రతి అంశాన్ని వైద్యులు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు. సిద్ధార్థ శుక్లా కుటుంబం ఎలాంటి అనుమానాలు లేవనెత్తలేదు. పోలీసులు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో అనేది.

    English summary
    After learning of Sidharth Shukla's death, a fan has fallen into a partial coma. After having a heart attack Sidharth Shukla passed away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X