Ram Janmabhoomi Watch: సల్మాన్ చేతికి రాములోరి వాచ్ .. అదిరిపోయే ఫీచర్స్.. ఎన్ని లక్షలంటే ?
బాలీవుడ్ సూపర్‌స్టార్ 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ నటిస్తున్నారు. స్టైల్, ఫ్యాషన్ విషయంలో ఆయన దరిదాపుల్లో యంగ్ హీరోలు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. మార్కెట్‌లో వచ్చే లేటెస్ట్ ఫ్యాషన్‌ను ఆయన ఫాలో అవుతుంటారు. ఇక ఎలక్ట్రానిక్ గాడ్జెస్ట్, లగ్జరీ కార్ల విషయంలోనూ అప్‌డేటెడ్‌గా ఉంటారు సల్మాన్. తాజాగా ఈ కండల వీరుడు ధరించిన వాచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ .. తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సికిందర్‌లో నటించింది. రంజాన్ కానుకగా మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వరుసగా నాలుగో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రష్మిక భావిస్తున్నారు. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలు హ్యాట్రిక్ హిట్లు కొట్టడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. తాజాగా సికిందర్ ద్వారా మరో హిట్‌ను సొంతం చేసుకోవాలని రష్మిక మందన్న భావిస్తున్నారు.

తాను సినిమా షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తానంటూ జరుగుతున్న ప్రచారంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. నేను అలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే ఈ స్థాయికి రావడం సాధ్యమయ్యేది కాదని ఆయన తెలిపారు. తాను 11 గంటల తర్వాతే షూటింగ్‌లకు హాజరవుతానని.. ఒక్కసారి స్పాట్‌కు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోనని, సెట్‌లో వేసిన టెంట్‌లోనే కూర్చొని పనిచేసుకుంటానని సల్మాన్ తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నా ప్రేమయం ఉంటుందని.. సినిమా గురించే ఆలోచిస్తుంటానని ఆయన వెల్లడించారు.
అలాగే రష్మిక మందన్నతో వయసు తేడా అంశంపై జరుగుతున్న ట్రోలింగ్‌పైనా సల్మాన్ ఖాన్ స్పందించారు. హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు అంటూ ఘాటుగా బదులిచ్చారు సల్మాన్. ఒకవేళ రష్మికకు పెళ్లయి పాప పుడితే ఆమెతో కూడా కలిసి నటిస్తానని.. అందుకు రష్మిక అనుమతి తీసుకుంటానని కుండబద్ధలు కొట్టారు.
సికందర్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో రష్మిక - సల్మాన్ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాకబ్ అండ్ కో రూపొందించిన రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ వాచ్‌ను ధరించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు సల్మాన్ ఖాన్. జాకబ్ కంపెనీ ఛైర్మన్ జాకబ్ అరాబోతో సల్మాన్ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ కంపెనీ వాచ్‌లను ధరిస్తూ వాటిని ప్రమోట్ చేస్తున్నారు సల్లూభాయ్.
ఈ వాచ్‌లో అయోధ్య రామమందిర నమూనా, హిందూ దేవత మూర్తులు ఉన్నారు. డయల్‌పై హిందూ దేవతల శాసనాలు, 44ఎంఎం కేస్, నీలమణి క్రిస్టల్ గ్లాస్‌తో ఈ వాచ్‌ను ఆకర్షణీయంగా తయారు చేశారు. దీని విలువ రూ.34 లక్షల నుంచి రూ.61 లక్షల వరకు ఉంటుందని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ వాచ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











