twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెంపర్ రీమేక్ ఆ విషయంలో ఫెయిల్.. తొలి వీకెండ్ వసూళ్లు!

    |

    రణవీర్ సింగ్ నటించిన తాజా చిత్రం సింబా.రణవీర్ సింగ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఎన్టీఆర్ మూవీ టెంపర్ కు ఈ చిత్రం రీమేక్. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది. రణవీర్ సింగ్, సారా అలీఖాన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో కామియో రోల్స్ లో నటించారు. సింబా తొలి వీకెండ్ కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

    తొలి వీకెండ్ వసూళ్లు

    తొలి వీకెండ్ వసూళ్లు

    సింబా చిత్రం మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ తెలుగు టెంపర్ స్థాయిలో ఈ చిత్రం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా రణవీర్ సింగ్ క్రేజ్, సారా అలీఖాన్ గ్లామర్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో మంచి వసూళ్లే నమోదవుతున్నాయి. తొలి వీకెండ్ ముగిసే సమయానికి సింబా చిత్రం 75 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

     ఆ విషయంలో ఫెయిల్

    ఆ విషయంలో ఫెయిల్

    వీకెండ్ వసూళ్ల పరంగా సింబా చిత్రం రణవీర్ సింగ్ కు సెకండ్ హైయెస్ట్. గతంలో దీపికా, రణవీర్ సింగ్ నటించిన పద్మవత్ చిత్రం తొలి వీకెండ్ లో 114 కోట్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని అధికమించడంలో సింబా చిత్రం విఫలం చెందింది అని చెప్పొచ్చు. టెంపర్ కథకు కొన్ని మార్పులు చేసి సింబా చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ లో రోహిత్ శెట్టి ఎంటర్ టైనింగ్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు.

    Poll: ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు 2018Poll: ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు 2018

     దర్శకుడికి కృతజ్ఞతలు

    దర్శకుడికి కృతజ్ఞతలు

    సింబా విజయం పట్ల రణవీర్ సింగ్ దర్శకుడు రోహిత్ శెట్టికు కృతజ్ఞతలు తెలిపాడు. మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా నటించానని అనుకుంటున్నా. ఈ చిత్రం చేసే సమయంలో చాలా ఎంజాయ్ చేశా అని రణవీర్ సింగ్ తెలిపారు. ఈ పాత్రలో నటించడం అంత సులువైన విషయం కాదు. మా చిత్ర యూనిట్ శ్రమ ఫలితంగా ఈ చిత్రం బాగా వచ్చిందని రణవీర్ తెలిపాడు.

    రణవీర్ టాప్ మూవీస్ ఇవే

    రణవీర్ టాప్ మూవీస్ ఇవే

    పద్మావత్ చిత్రం తొలి వీకెండ్ వసూళ్ల సందర్భంగా రణవీర్ చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. పద్మావత్ 114 కోట్ల ఫస్ట్ వీకెండ్ లోనే రాబట్టిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సెలవు ఈ చిత్రానికి బాగా కలసి వచ్చింది. సింబా చిత్రం ద్వితీయ స్థానంలో నిలువగా, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, గూండే చిత్రాలు తదుపరి స్థానంలో నిలిచాయి.

    English summary
    Simmba fails to BEAT Padmaavat, becomes Ranveer Singh's second-highest opening weekend grosser. Ranveer thanked director Rohit Shetty for the success of Simmba
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X