మన సినిమాలు రీమేక్ చేస్తూ భలే రికార్డ్ కొట్టాడే: వరుసగా 8 వంద కోట్ల హిట్స్!
కథలో దమ్ముంటే, కంటెంటులో పవర్ ఉంటే టాలీవుడ్లో అయినా, బాలీవుడ్లో అయినా ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుందని మరోసారి రుజువైంది. తెలుగు హిట్ మూవీ 'టెంపర్' బాలీవుడ్ రీమేక్ 'సింబా' బాక్సాఫీసు వద్ద సూపర్ వసూళ్లు సాధిస్తోంది.
రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన సింబా తొలి 5 రోజుల్లోనే రూ. 124 కోట్లు వసూలు చేసింది. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ ముగిసిన తర్వాత 6వ రోజు కూడా మంచి వసూళ్లు రాట్టింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు రూ. 20.72 కోట్లు రాబట్టి రణవీర్ సింగ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్‌గా నిలిచింది.
రణవీర్ సింగ్ ట్వీట్
రణవీర్ సింగ్ నటించిన ‘సింబా' 5 రోజుల్లో రూ. 124 కోట్ల వసూలు చేయడంతో.... రోహిత్ శెట్టి ఈ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం ఓవరాల్ రన్‌లో రూ. 200 కోట్ల మార్కును అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.
వరుసగా 8 హిట్స్
రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన గోల్ మాల్ 3, సింగం, బోల్ బచ్చన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం రిటర్న్స్, దిల్ వాలే, గోల్ మాల్ ఎగైన్, సింబా చిత్రాలు రూ. 100 కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించాయి.

గోల్‌మాల్ ఫ్రాంచైజీ
బాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ‘గోల్ మాల్' సిరీస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి.... ఈ సీరిస్‌లో 4 సినిమాలు రాగా అన్నీ కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

సౌత్ రీమేక్ సినిమాలతో...
సౌత్ హిట్స్ సింగం, సింగం 2, టెంపర్ మొదలగు చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేయడం ద్వారా రోహిత్ సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్లో మాస్ మసాలా, కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

నెక్ట్స్ మరో పోలీస్ డ్రామాతో...
2019లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో మరో పోలీస్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











