11 రోజుల్లో సెంచరీ... రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘టెంపర్’ రీమేక్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టెంపర్' బాలీవుడ్లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో 'సింబా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అక్కడ విడుదల ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది.
రణవీర్ సింగ్ సరసన సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా చేస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా 'ఆంఖ్ మేరే' సాంగ్ రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం 11 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే ఇదో రికార్డుగా పేర్కొంటున్నారు.ఈ విషయమై కరణ్ జోహార్ స్పందిస్తూ... ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్. అన్ని రికార్డులు బద్దలయ్యాయి అయిన ట్వీట్ చేశారు.
1996లో వచ్చిన 'తేరె మేరె సప్నే' సినిమాలోని 'ఆంఖ్ మేరే' పాటు ఈ చిత్రంలో రీమక్స్ చేశారు. అప్పట్లో ఈ పాట అర్షద్ వర్షి, సిమ్రాన్ భాగ్ మీద చిత్రీకరించగా సూపర్ హిట్ అయింది. దాన్ని రీమేక్స్ చేయడంతో రెస్పాన్స్ అదిరిపోయింది.

'సింబా' చిత్రంలో రణవీర్ సింగ్ అనినీతి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అతడు అలా ఎందుకు మారాడు? చివరకు ఎలా రియలైజ్ అనేది కథ. ఏసిపి సంగ్రామ్ సింబా బలేరా పాత్రలో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ పవర్ ఫుల్‌గా ఉండబోతోంది. డిసెంబర్ 28న ఈ చిత్రం విడుదలకాబోతోంది.


Click it and Unblock the Notifications











