ఎన్టీఆర్ 'టెంపర్' రీమేక్.. నవ్వు, ఏడుపు ఒకేసారి వస్తాయి!
Recommended Video

బాలీవుడ్ లో తెలుగు చిత్రాలకు క్రమంగా ప్రాధానత్య పెరుగుతోంది. తెలుగు చిత్రాలు నేరుగా హిందీలో విడుదలవుతూ రాణిస్తున్నాయి. ఇక మరి కొన్ని తెలుగు చిత్రాలని బాలీవుడ్ దర్శకులు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని ప్రముఖ బాలీవడ్ దర్శకుడు హిందీలో సింబా పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు రానున్న సందర్భంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

రణవీర్ సింగ్ హీరోగా
రోహిత్ శెట్టి దర్శత్వం వహించిన సింబా చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. రణవీర్ సింగ్ పోషించే పోలీస్ ఆఫీసర్ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. రణవీర్ సింగ్ కు జోడిగా సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ నటిస్తోంది. సారా కు బాలీవుడ్ లో ఇది రెండవ చిత్రం. సారా నటించిన కేదర్ నాథ్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ బాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

నవ్వు, ఏడుపు ఒకేసారి
ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రంలో యాక్షన్, ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు సమపాళ్లలో ఉన్నాయి. సింబా చిత్రంలో కూడా దర్శకుడు రోహిత్ శెట్టి అదే ఫార్ములా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సన్నివేశాలు గిలిగింతలు పెట్టె సంతోషాన్నీ కలిగిస్తాయి. అదే సమయంలో ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి అని రోహిత్ శెట్టి మీడియా సమావేశంలో తెలిపారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికని ఆడియన్స్ ఎప్పుడూ ఇష్టపడతారని రోహిత్ శెట్టి అన్నారు.

కొత్తగా క్రియేట్ చేయలేదు
టెంపర్ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో మేము మొత్తగా ఏమీ ట్రై చేయలేదు. ఉన్నదాన్ని పర్ఫెక్ట్ గా చూపించాం. ఈ చిత్రం మీ మనసులో ఓ ఉత్తేజాన్ని నింపుతుందని రోహిత్ శెట్టి అన్నారు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో సోనూ సూద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక అవినీతి పోలీసు అధికారి మంచిగా ఎలా మారాడు అనేదే ఈ చిత్ర కథ. మంగళవారం రోజు సింబా చిత్ర ప్రీమియర్ షోని ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ప్రదర్శించారు.

టెంపర్‌లో నటవిశ్వరూపం
ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం 2015లో విడుదలయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దయ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటవిశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అవినీతి పరుడిగా, మంచి వాడిగా ఎన్టీఆర్ తన పాత్రలో చూపించిన వేరియషన్స్ అద్భుతం. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక సింబా చిత్రం డిసెంబర్ 28 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











