భారతీయ కుక్కలు అంటూ దారుణంగా అవమానించారు

By Bojja Kumar

Recommended Video

Adnan Sami Tweets About His Staff Being ill-Treated At Kuwait Airport

ప్రముఖ సింగర్ అద్నన్ సమీ తన అఫీషియల్ ఖాతాలో చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల తన బృందంతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి కువైట్ వెళ్లిన ఆయన అక్కడ తన టీం ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులను వెల్లడిస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దీనిపై స్పందించాలని, భారతీయులకు జరిగిన అవమానంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అద్నన్ సమీ చేసిన ట్వీట్ మీద సుష్మా స్వరాజ్ కూడా స్పందించడం విశేషం.

భారతీయ కుక్కలు అంటూ...

భారతీయ కుక్కలు అంటూ...

కువైట్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు తన బృందం పట్ల పట్ల దారుణంగా ప్రవర్తించారని, ‘భారతీయ కుక్కలు' అని తమను దూషించారని ట్విట్టర్ ద్వారా అద్నన్ సమీ వెల్లడించారు.

ఎంతో ప్రేమతో వస్తే ఇలా చేస్తారా?

ఎంతో ప్రేమతో మీ నగరానికి వచ్చాం. కానీ మీరు మాకు ఎలాంటి సపోర్టు ఇవ్వకపోగా.... ఎలాంటి కారణం లేకుండా తమ పట్ల నీచంగా ప్రవర్తించారు. మా వాళ్లపై భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మేము ఊరికే వదిలిపెట్టబోము అంటూ కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయానికి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు.

వారికి ఎంత ధైర్యం?

వారికి ఎంత ధైర్యం?

ఈ విషయాన్ని అద్నాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ‌మీకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పొగరుగా ప్రవర్తించడానికి వారికి ఎంత ధైర్యం?' అంటూ అద్నన్ సమీ ట్విట్టర్లో పేర్కొన్నారు.

స్పందించిన సుష్మా స్వరాజ్

అద్నన్ సమీ చేసిన ట్వీట్‌పై విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ స్పందించారు. మీరు నాతో ఫోన్‌లో మాట్లాడండి అని ట్వీట్‌ చేశారు. దీనిపై అద్నన్ రియాక్ట్ అవుతూ సుష్మ స్వరాజ్‌కు ధన్యవాదాలు. ఆమె మా బాధ అర్థం చేసుకుని సహాయం చేస్తున్నారు, ఇలాంటి మంత్రి ఉన్నందుకు గర్వంగా ఉంది అని అద్నన్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X