Bigg Boss లో కంటెస్టెంట్ ఆత్మాహత్యాయత్నం.. హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో 15 సీజన్‌లో అపశృతి చోటు చేసుకొన్నది. టాస్క్‌లో ఓటమి చెందడాన్ని తట్టుకొలేకపోయిన కంటెస్టెంట్‌తో కత్తితో తనకు తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంపై బిగ్‌బాస్ తీవ్రంగా స్పందించారు. తనపై నియంత్రణను కోల్పోయి స్వయంగా గాయపరుచుకోవడం గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నిర్వాహకులు కంటెస్టెంట్‌ను షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

అఫ్సానా ఖాన్ ఆత్మహత్యాయత్నం
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 15 షోలో అఫ్సానా ఖాన్ కంటెస్టెంట్‌గా రాణిస్తున్నారు. వీఐపీలను కలిసే టాస్క్‌ను ఇటీవల ఇంటిలో నిర్వహించారు. అయితే ఈ టాస్క్‌లో ఓడిపోయిన అఫ్సానా ఖాన్ మానసికంగా సంయమనం కోల్పోయింది. దాంతో కత్తితో తనను తాను గాయపరుచుకొనేందుకు ప్రయత్నించినట్టు బుధవారం రిలీజ్ చేసిన ప్రోమోలో స్పష్టంగా కనిపించింది.

షమితా శెట్టి చెల్లెలితో గొడవ
వీఐపీ యాక్సెస్ టాస్క్ సందర్బంగా తన సహచర కంటెస్టెంట్, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో తరచు గొడవలు పడటం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ఇంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం వివాదంగా మారింది. దాంతో అఫ్సానా ఖాన్‌ను ఇంటి నుంచి బయటకు పంపించాలని బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు.

కంటెస్టెంట్‌పై భౌతికదాడి ఆరోపణలతో
సింగర్ అఫ్షానా ఖాన్‌ను ఇంటి నుంచి బయటకు పంపించే ముందు ఇంటి సభ్యులందరిని లివింగ్ రూమ్‌లో సమావేశపరిచారు. షమితా శెట్టిపై భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అఫ్షానా ఖాన్‌ను ఇంటి నుంచి బయటకు పంపించాలని నిర్ణయం తీసుకొన్నాం అని బిగ్‌బాస్ కంటెస్టెంట్ల అనుమతి, అభిప్రాయాలను తీసుకోవడం ప్రోమోలో కనిపించింది.

అప్షానా ఖాన్ మానసికంగా
వీఐపీ యాక్సెస్ టాస్క్ సందర్భంగా జరిగిన సంఘటనలతో అప్షానా ఖాన్ మానసికంగా ఓ షాక్ గురైంది. ఆ షాక్‌లో సహచర కంటెస్టెంట్లపై దాడికి ప్రయత్నించింది. ఆమెకు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరం ఉంది. కాబట్టి అఫ్షానా ఖాన్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నాం అని బిగ్‌బాస్ చెప్పినట్టు సమాచారం.

అప్షాన్ ఖాన్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్
అయితే తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన అఫ్షానా ఖాన్‌ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా అప్షానా ఖాన్ ఎలిమినేషన్ గురించి కథనాలు వెలువడ్డాయి. అయితే పూర్తి వివరాలు బుధవారం రాత్రికి ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌లో స్పష్టత వస్తుంది.
Recommended Video

అఫ్షానా ఖాన్ ఎవరు? ఆమె కెరీర్ ఇలా..
అఫ్సానా ఖాన్ విషయానికి వస్తే.. పంజాబ్‌కు చెందిన యువ గాయని. సింగర్‌గానే కాకుండా నటిగా, గేయ రచయితగా రాణిస్తున్నారు. వాయిస్ ఆఫ్ పంజాబ్ 4 షోలో టాప్ 5లో నిలిచారు. బజార్, పెయిర్, తిత్లియాన్, కమాల్ కర్తే హో, జఖమ్, జొడా అనే ఆల్బమ్స్‌ను రూపొందించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ 15 షోలో కంటెస్టెంట్‌గా ఉన్నారు.


Click it and Unblock the Notifications