నా తొడలపై చేతులు వేశాడు.. ఇంటర్వ్యూ కోసం వెళితే దారుణంగా..!
బాలీవుడ్ లో మీటూ క్యాంపైన్ జోరందుకుంది. హీరోయిన్ తనుశ్రీ తద్ద నానా పాటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రవీనా టాండన్, కంగనా రనౌత్ ఇలా ప్రముఖ హీరోయిన్లంతా మీటూ క్యాంపైన్ మొదలు పెట్టి వారికి ఎదురైన లైంగిక వేధింపులని బట్టబయలు చేస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి ఓ మహిళా జర్నలిస్ట్ కూడా చేరింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ పై సంచలన ఆరోపణలు చేసింది.

తనుశ్రీ దత్తకు పెరుగుతున్న మద్దత్తు
బాలీవడ్ ప్రముఖుల నుంచి తనుశ్రీ దత్తకు మద్దత్తు పెరుగుతున్న సమయంలో మీ టూ క్యాంపైన్ మరింతగా జోరందుకుంది. నటాషా అనే మహిళా జర్నలిస్ట్ ప్రముఖ సింగర్ కైలాష్ నీచమైన పనిని బట్టబయలు చేసింది. అన్ని భాషల్లో పాటలు పాడుతూ కైలాష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇంటర్వ్యూ కోసం వెళితే
నటాషా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన లైంగిక వేధింపులని బయట పెట్టింది. తాను ప్రముఖ ఆంగ్ల పత్రికలో ఫోటో జర్నలిస్ట్ గా 2006 లో పనిచేశా. ఆ సమయంలో కైలాష్ ఖేర్ తో ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ చేయడానికి తనతో పాటు మరో మహిళా జర్నలిస్ట్ కూడా వచ్చింది. నేను ఫొటోగ్రాఫ్స్ తీయాలి.
ఇద్దరి మధ్యలో
ఇంటర్వ్యూ జరిగే సమయంలో కైలాష్ మా ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. కొంత సమయానికి కైలాష్ తన తొడలపై నెమ్మదిగా చేతులు వేయడం ప్రారంభించారు. చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు చేస్తున్న నీచమైన పనిని నాతో వచ్చిన మరో జర్నలిస్ట్ కూడా గమనించింది.
ఇద్దరం సాక్షులం
అతడి లైంగిక వేధింపులకు మేదిద్దరామే సాక్షులం. అతడు చేసిన నీచమైన పని గురించి వార్త రాయాలని నాతో వచ్చిన జర్నలిస్ట్ కు సూచించాను. ఇలాంటి వాటి గురించి రాయకపోవడమే మంచిది. సైలెంట్ గా ఉండు అంటూ వారించింది. ఆ సమయంలో అతడిని తానేమి చేయలేకపోయానని నటాషా ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

ఖండించిన కైలాష్
నటాషా ఆరోపణలని కైలాష్ ఖండించారు. ఆమె వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి అని అన్నారు. మహిళల పట్ల నీచంగా ప్రవర్తించే మనస్తత్వం తనకు లేదని కైలాష్ తెలిపాడు. ఆమె పేర్కొంటున్న ఘటన ఏది తన జీవితంలో జరగలేదని తెలిపాడు.

వాళ్ళని అడగండి
నా వ్యక్తిత్వం గురించి తెలిసిన మహిళలు చాలా మందే ఉన్నారు. మహిళలకు తాను ఎంత గౌరవం ఇస్తానో వారిని అడిగి తెలుసుకోవాలని కైలాష్ సూచించాడు. నేను జర్నీలో ఉండగా ఈ వార్త తెలిసింది. ఆమె వ్యాఖ్యలు విని మస్తపానికి గురయ్యానని కైలాష్ తెలిపారు. నా సంతోషం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది తెలిపాడు.


Click it and Unblock the Notifications











