హస్పిటల్‌లో కనికాకపూర్ పరిస్థితి దారుణం.. కర్టెన్ చాటునే దుస్తులు.. మీడియాతో ఫ్యామిలీ

బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ వ్యవహారం వివాదాస్పదమైనప్పటికీ.. ఆమె ప్రవర్తించిన తీరు అన్ని వర్గాల నుంచి విమర్శలకు గురైంది. లండన్ నుంచి మే మూడో వారంలో భారత్‌కు వచ్చిన నేపథ్యంలో కరోనాకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ పరీక్షలకు హాజరుకాకుండా దొంగదారిన లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో మాజీ సీఎం వసుంధరా రాజే, ఆయన కుమారుడు దుష్కంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారనే విషయం రాజకీయంగా అత్యంత వివాదంగా మారింది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించిన విషయాలు ఇవే..

మార్చి 19న అలా జరిగింది..

మార్చి 19న అలా జరిగింది..


కనికా కపూర్‌ను మార్చి 19న మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్షించడానికి వైద్యులు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు కరోనా పాజిటివ్ అనే రిపోర్టును తెలిపారు. అదే ఉదయం ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించి లక్నోలోని పీజీఐ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె వెంటనే మేము కారులో వెంబడించాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

కర్టెన్ చాటున దుస్తులు మార్చుకోమంటే..

కర్టెన్ చాటున దుస్తులు మార్చుకోమంటే..


కనికాకపూర్ హాస్పిటల్‌కు తరలించిన తర్వాత దుస్తులు మార్చుకోవాలని సూచించారు. ఆ పక్కనే కర్టెన్ చాటుకు వెళ్లి బట్టలు మార్చుకోమంటే ఆమె నిరాకరించారు. ఆ తర్వాత క్వారంటైన్ రూమ్‌ చాలా దారుణంగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయమంటే వైద్య సిబ్బంది మండిపడ్డారు. ఆ క్రమంలోనే చికిత్సకు సహకరించడం లేదు, సెలబ్రిటీల వ్యవహరిస్తున్నదని ఆమెపై కొన్ని ఆరోపణలు చేశారు.

రెండువారాలుగా అలాంటి పరిస్థితుల్లోనే..

రెండువారాలుగా అలాంటి పరిస్థితుల్లోనే..


అప్పటి నుంచి కనికాకపూర్ సంజయ్ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆమె రూమ్‌లో చదువుకోవడానికి పుస్తకాలు ఇవ్వడం లేదు. రూమ్‌లో టీవీ లేదు. కరోనా నేపథ్యంలో బయట ఏం జరుగుతున్నదనే విషయం తెలియకుండా ఎలాంటి సమాచారం అందడం లేదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మెరుగైన సదుపాయాలు లేకుండానే ఆమెకు చికిత్స చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Recommended Video

Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie
ఈ సారి నెగిటివ్ అనే భావనతో

ఈ సారి నెగిటివ్ అనే భావనతో


గత రెండు వారాలుగా హాస్పిటల్‌లో నరక వేదన అనుభవిస్తున్నారు. ఇప్పటికి ఐదోసారి కరోనా పాజిటివ్ అనే రిపోర్టులు వచ్చాయి. ఏప్రిల్ 2వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే అవి నెగిటివ్‌గా వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ సానుకూలమైన రిపోర్టులు వస్తే మా కూతురు తన పిల్లలను చూసుకోవాలనే ఆశతో ఉన్నారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X