కనికా కపూర్‌కు మరో షాక్.. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్.. మరుసటి రోజే పోలీసుల నోటీసులు
కరోనావైరస్ సోకిన తర్వాత క్వారంటైన్ జీవితంలో ఉండగా జరిగిన వివాదాల గురించి బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ సుదీర్గమైన లేఖను పోస్టు చేసిన మరుసటి రోజే మరో షాక్ తగిలింది. కరోనా విస్తరిస్తున్న సమయంలో కనికా బాధ్యతారహితంగా వ్యవహరించారని లక్నో మెడికల్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు, నమోదు చేసిన కేసుపై పోలీసులు చర్యలు చేపట్టారు. విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు నోటీసులు పంపారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ సర్చ్‌లో టాప్‌గా
లండన్ నుంచి వచ్చిన కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలగానే ఆమె గురించి గూగుల్‌లో విస్తృతంగా వెతికారు. ప్రియాంక చోప్రా, రజనీకాంత్ కంటే ఎక్కువగా కనికా గురించే తెలుసుకోవాలని ప్రయత్నించారు. కనికా కపూర్ మోస్ట్ సర్చ్‌డ్ సెలబ్రిటీగా రికార్డులకెక్కింది. మహిళా, పురుష సెలబ్రిటీలలో ఆమెనే టాప్‌గా నిలిచింది. లాక్‌డౌన్‌లో కనికా కపూర్ ఎవరు? ఆమె వివరాలు ఏమిటి? కరోనా సోకిన తర్వాత ఆమె పరిస్థితి ఏమిటి? అని యాహు వెల్లడించింది.

కరోనా వ్యాప్తికి దోహదం
ఇక లండన్ నుంచి వచ్చిన తర్వాత మార్చి 20న పాజిటివ్ అని తేలడంతో కనికాను లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ ఇనిస్టిట్యూబ్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం దాదాపు 21 రోజుల తర్వాత ఆమెకు నెగిటివ్ అని తేలడంతో డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారని, కరోనా వ్యాప్తికి దోహదపడేలా వ్యవహరించారని లక్నో పోలీసులకు వైద్యులు ఫిర్యాదు చేశారు.

లక్నో హాస్పిటల్ అధికారి ఫిర్యాదుతో
లక్నోలోని సంజయ్ గాంధీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుతో కనికాకపూర్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 269, 270, కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆమెకు లక్నో కృష్ణా నగర్ ఏసీపీ దీపక్ కుమార్ సింగ్ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం వెల్లడైన విషయాలను బట్టి ఆమెపై చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టిన మరుసటి రోజే
నేను క్వారంటైన్‌లో ఉండగా నాపై వచ్చిన కథలు, వార్తలు, రూమర్లపై నేను స్పందించదలచుకోలేదు. ఎందుకంటే నావైపు కొంత తప్పు జరిగింది కనుక నేను ఏమీ మాట్లాడటం లేదు. అయితే ఆ విషయంలో చాలా తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం దండిగా జరిగింది. నా విషయంలో జరిగిన తప్పుడు ప్రచారానికి కాలమే సమాధానం చెప్పాలని నేను భావిస్తున్నాను. ఒకరోజు తప్పుకుండా అసలు విషయం బయటకు వస్తుంది. నాపై కట్టు కథలు అల్లిన వాళ్లు తప్పుకుండా వారి చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతారు అని కనికా కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలా స్టేట్‌మెంట్ విడుదల చేసిన మరుసటి రోజే ఆమెకు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











