కరోనాతో కనికాకపూర్.. దొంగచాటుగా పార్టీలకు.. మాజీ సీఎం మెడకు ఉచ్చు!

సింగర్ కనికా కపూర్ వివాదాస్పద తీరు ఇప్పుడు కేవలం సినిమా పరిశ్రమకే కాకుండా రాజకీయ వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. గతవారం లండన్ నుంచి లక్నోకు తిరిగి వచ్చిన ఈ గాయనికి తాజాగా కరోనా వైరస్ సోకిందనే వార్తలు గుప్పమనడంతో వివాదంగా మారింది. లక్నో ఎయిర్‌పోర్టులో హెల్త్ చెకప్స్‌ చేయించకోకుండా దొంగదారిన ఎయిర్‌పోర్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారనే ఆరోపణలు వస్తుండగానే.. ఆమె గురించి మరో వివాదాస్పద అంశాలు మీడియాలో వెలుగు చూడటంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నది. కనికాకపూర్ ఏం చేశారనే విషయంలో వెళితే..

 మూడు పార్టీలకు హాజరు

మూడు పార్టీలకు హాజరు

లండన్ నుంచి లక్నోకు చేరుకొన్న కనికా సింగ్ ఆ తర్వాత మూడు విలాసవంతమైన పార్టీలకు హాజరయ్యిందని స్వయంగా తండ్రి రాజీవ్ కపూర్ మీడియాకు సమాచారం ఇవ్వడంతో కనికా తీరు మరింత విమర్శలకు గురైంది. అంతేకాకుండా హోలీ సందర్భంగా జరిగిన పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉండటం రాజకీయంగా దుమారం చెలరేగుతున్నది.

 మాజీ సీఎం ఫ్యామిలీ పార్టీలో

మాజీ సీఎం ఫ్యామిలీ పార్టీలో

కనికాకపూర్ హాజరైన పార్టీలో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుటుంబం ప్రముఖంగా కనిపించింది. రాజే కుమారుడు, పొలిటిషియన్ దుష్యంత్ సింగ్ కూడా ఈ పార్టీలో ఉండటం మరింత విమర్శలకు దారి తీసింది. స్వయంగా దుష్యంత్ కుమారుడు, కోడలు ఈ పార్టీని నిర్వహించడం బట్టి చూస్తే రాజకీయ ప్రత్యర్థులకు మంచి అస్త్రమే లభించినట్టు కనిపిస్తున్నది.

బర్త్ డే ఫంక్షన్‌లో

బర్త్ డే ఫంక్షన్‌లో

ఇక బీఎస్పీ ఎంపీ అక్బర్ ఆహ్మద్ డంపీ కుటుంబ సభ్యుడు ఆదిల్ ఆహ్మద్ నిర్వహించిన బర్త్ డే పార్టీకి కూడా కనికా కపూర్ హాజరయ్యారు. ఈయన వసుంధర రాజే ఇంటికి ఇంటీరియర్ డిజైనర్‌గా సేవలందిస్తుంటారు. ఈ పార్టీకి యూపీ ఆరోగ్యశాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ కూడా హాజరుకావడం గమనార్హం.

ఫ్యామిలీ గెట్ టుగెదర్ మాత్రమే

ఫ్యామిలీ గెట్ టుగెదర్ మాత్రమే


వివాదాలు చుట్టుముట్టిన తర్వాత కనికాకపూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యామిలీకి సంబంధించిన చిన్న పార్టీకి హాజరయ్యాను అని వివరణ ఇచ్చింది. అయితే తండ్రి చెప్పిన ప్రకారం.. కనికా కపూర్ హాజరైన పార్టీకి సుమారు 400 మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. ఈ పార్టీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారని చెప్పారు. అయితే తండ్రి చెప్పిన విషయాన్ని కనికా కపూర్ ఖండించారు.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
 నాకు తెలియదా? రూల్స్ అతిక్రమించలేదు

నాకు తెలియదా? రూల్స్ అతిక్రమించలేదు

కరోనావైరస్‌కు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించలేదని, తాను విద్యావంతురాలినని కనికా కపూర్ అన్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీల అనంతరమే తాను బయటకు వచ్చానని, ఈ వివాదం తర్వాత సీఎంవోకు ఫోన్ చేసి తనిఖీలు చేసుకోవచ్చని చెప్పానని ఆమె అన్నారు. ఎయిర్‌పోర్టులో అన్ని పత్రాలపై సంతకాలు చేశానని కూడా చెప్పారు. ప్రస్తుతం కనికా కపూర్ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X