సింగర్ కనికాకు కరోనా.. దొంగ దారిన స్వదేశంలోకి.. దేశ బహిష్కరణ అంటూ..
ప్రపంచ దేశాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. కరోనాను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా సింగర్ కనికా కపూర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను, దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కిన ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ఏమైందంటే..

అధికారుల కన్నుగప్పి స్వదేశంలోకి
సింగర్ కనికాకపూర్‌కు కరోనావైరస్ బారిన పడిన జాబితాలో చేరారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 టెస్టులు పాజిటివ్ అని తేలాయి. గత ఆదివారం ఆమె లండన్ నుంచి స్వదేశానికి చేరుకొన్నది. అయితే అధికారులు కన్నుగప్పి ప్రామాణిక పరీక్షలు నిర్వహించుకోకుండా దొంగదారిన ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిందనే తాజా సమాచారం.

లక్నో ఎయిర్‌పోర్టులో దొంగదారిన
లక్నో ఎయిర్‌పోర్టులో కరోనా తనిఖీ పరీక్షలు చేయించకుండా దొంగదారిన బయటకు వెళ్లింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లి అక్కడే బస చేసింది. అంతేకాకుండా కరోనా లక్షణాలతో 100 మందికిపైగా హాజరైన విందుకు హాజరైంది అని అధికారులు తాజాగా తేల్చారు.

దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కనికాకపూర్ వ్యవహరించింది. అధికారులతో కుమ్మక్కై ఎయిర్‌పోర్టు నుంచి అడ్డదారిలో హోటల్‌కు వెళ్లింది. వాష్ రూమ్‌లో దాక్కొని తనిఖీ అధికారుల కన్నుగప్పి బయటకు వచ్చింది. కావున ఆమెకు భారీగా శిక్షతోపాటు జరిమానా కూడా విధించాలి అని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video

కనికాను అరెస్ట్ చేయాలి
సింగర్ కనికాకపూర్ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖలు సంధిస్తున్నారు. కనికాను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమె రికవరీ అయిన తర్వాత ఎపిడమిక్ యాక్ట్, 1897 సెక్షన్ 3 ప్రకారం కఠినంగా శిక్షించాలి. ఇది బయోటెర్రిరిజానికి నిదర్శనం. కరోనాపై మన పోరాటానికి తూట్లు పొడిచే విధంగా కనికా వ్యవహరించారు అని నెటిజన్లు భగ్గుమంటున్నారు.


Click it and Unblock the Notifications











