సింగర్ కనికాకపూర్‌కు ఊహించని షాక్.. 48 గంటలకోసారి..!
బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ పరిస్థితి గంభీరంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇప్పట్లో హాస్పిటల్ నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరోసారి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమె ఇంకా విషమ పరిస్థితుల్లోనే ఉందనే విషయం స్పష్టమైంది. వివరాల్లోకి వెళితే..

ఐదోసారి కరోనా పాజిటివ్
గత రెండు రోజుల క్రితం కనికాకపూర్ సోషల్ మీడియాలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి పరీక్షల్లో నాకు నెగిటివ్ వస్తుందనే విషయాన్ని పేర్కొన్నారు. ఈ సారి నెగిటివ్ వస్తే ఇంటికి వెళ్లి పిల్లల్ని చూడాలనే కోరికను బయటపెట్టింది. అయితే ఆమె అంచనాలకు భిన్నంగా కనికాకపూర్‌కు ఐదోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది.

కనికాకపూర్‌కు కరోనా టెస్టులు ఇలా
సింగర్ కనికాకపూర్ మార్చి 9న లండన్ నుంచి లక్నోకు వచ్చింది. అమెకు మార్చి 20వ తేదిన కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మార్చి 24 రెండోసారి, మార్చి 28న మూడోసారి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మార్చి 30న నాలుగోసారి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 31న వెల్లడైన రిపోర్టుల్లో ఐదోసారి కూడా పాజిటివ్ అని వెల్లడైంది.

లక్నోలోని హాస్పిటల్‌లో
ప్రస్తుతం కనికాకపూర్‌కు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతున్నది. అయితే కనికా పరిస్థితి ఆందోళన కరంగా లేకపోయినా, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు అని వైద్యులు తెలిపారు.

48 గంటలకోసారి పరీక్షలు
ప్రతీ 48 గంటలకు ఒకసారి కనికాకపూర్‌కు రోగ నిర్ధారణ పరీక్షలు జరిపిస్తున్నాం. పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. అయితే ఆందోళనపడే అంతగా ఆమె ఆరోగ్యం క్షీణించ లేదు అని హాస్పిటల్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











