నీవు స్టార్ కాదు.. పేషంట్‌వి.. వేషాలు వెయ్యొద్దు..హాస్పిటల్‌లో రచ్చపై కనికాకు వార్నింగ్

కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా సింగర్ కనికాకపూర్ ప్రస్తుతం లక్నోలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. అయితే చికిత్సకు నిరాకరిస్తూ తనకు విలాసవంతమైన సౌకర్యాలు కావాలంటూ వైద్యులను, వైద్య సిబ్బందిపై రుసరుసలాడటం మీడియాలో చర్చనీయాంశమైంది. దాంతో ఈ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. సింగర్ తీరుపై వైద్యులు స్పందిస్తూ...

 పేషెంట్‌లా వ్యవహరించు

పేషెంట్‌లా వ్యవహరించు

ప్రాణాంతక వ్యాధి కరోనా బారిన పడిన కనికా కపూర్ ఓ స్టార్ మాదిరిగా కాకుండా.. ఓ పేషెంట్‌లా వ్యవహరించాలి. వైద్య సిబ్బందికి అన్ని రకాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.

కనికాకు ఉత్తమ సౌకర్యాలు

కనికాకు ఉత్తమ సౌకర్యాలు

కనికా కపూర్‌కు ఉత్తమ సౌకర్యాలను సమకూర్చాం. ఓ రోగిగా వైద్యులకు ఆమె సహకరించాలి. ఓ స్టార్ అనే ఫీలింగ్‌తో వైద్యులతో అభ్యంతరకరంగా బిహేవ్ చేయవద్దు. సిబ్బందికి పూర్తిగా సహకారం అందిస్తేనే ఆమె త్వరగా కోలుకొంటుంది అని డైరెక్టర్ ఆర్కే ధిమాన్ చెప్పారు.

ప్రత్యేక వసతులతో డైట్

ప్రత్యేక వసతులతో డైట్

కనికా కపూర్‌కు హాస్పిటల్‌లోని వంటగదిలో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్లూటెన్ ఫ్రీ డైట్ అందజేస్తున్నాం. టాయిలెట్, మంచి బెడ్, టెలివిజన్‌తోపాటు ఏసీ గదిని ఏర్పాటు చేశాం. ఆమె ఉంటున్న గదికి వెలుతురు, అన్ని రకాల వెంటిలేషన్ చక్కగా ఉంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్19 యూనిట్‌లో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశాం అని వైద్యులు వెల్లడించారు.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
వసుంధర రాజే సింధియాతో పార్టీ

వసుంధర రాజే సింధియాతో పార్టీ

ఇటీవల లండన్ నుంచి లక్నోకు చేరుకొన్న కనికా కపూర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు. బీజేపీ ఎంపీ, మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందుకు కనికా హాజరుకావడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆమెను గృహనిర్భంధంలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X