17 ఏళ్ల బాలికకు సెక్సువల్ హరాస్మెంట్: దుబాయ్‌లో ప్రముఖ సింగర్ అరెస్ట్!

పాపులర్ బాలీవుడ్ సింగర్ మికా సింగ్ దుబాయ్‌లో గురువారం అరెస్ట్ అయ్యాడు. అతడిపై యూఏఈలో సెక్సువల్ హరాస్మెంట్ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసకున్నారు. ఇండియన్ టాప్ సింగర్లలో ఒకరైన మికా సింగ్... విదేశాల్లో ఇలాంటి కేసులో అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశం అయింది.

ఓ వైపు బాలీవుడ్ చిత్ర సీమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం బలంగా ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా మికా సింగ్ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం, దేశ పరువు తీసే విధంగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అయింది.

17 ఏళ్ల బ్రెజిలియన్ అమ్మాయి ఫిర్యాదు

17 ఏళ్ల బ్రెజిలియన్ అమ్మాయి ఫిర్యాదు

మికా సింగ్ మీద 17 ఏళ్ల బ్రిజిలియన్ గర్ల్ ఫిర్యాదు చేసింది. అతడు తనకు అసభ్యకరమైన ఫోటోస్ పంపుతూ లైంగికంగా వేధిస్తున్నాడని సదరు బాలిక పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది.

తెల్లవారుఝామున 3 గంటలకు అరెస్ట్

తెల్లవారుఝామున 3 గంటలకు అరెస్ట్

బాలిక ఫిర్యాదు అందిన వెంటనే మికా సింగ్ కోసం గాలింపు చేపట్టిన దుబాయ్ పోలీసులు తెల్లవారు ఝామున 3 గంటలకు అతడిని బుర్జ్ దుబాయ్ వద్ద పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లిన మికా సింగ్

బాలీవుడ్ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లిన మికా సింగ్

దుబాయ్‌లో జరుగుతున్న ఒక బాలీవుడ్ ఈవెంటులో పెర్ఫార్మ్ చేసేందుకు మికా సింగ్ అక్కడికి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన దుబాయ్ ప్రోగ్రాం గురించి పేర్కొంటూ ‘హేయ్ దుబాయ్... నేను మీ నగరంలో ఉన్నాను. మొదటి సారిగా మోస్ట్ పాపులర్ అవార్డ్స్ ‘మసాలా అవార్డ్స్'లో పాల్గొనేందుకు వచ్చాను అని పేర్కొన్నారు.

తెలుగులో మికా సింగ్

తెలుగులో మికా సింగ్

మికా సింగ్ ఇండియన్ మోస్ట్ పాపులర్ సింగర్లలో ఒకరు. బాలీవుడ్,. కన్నడ, ఒడియా, బెంగాలీ సినిమాలతో పాటు తెలుగులో రవితేజ మూవీ బలుపులో కూడా ఓ పాట పాడారు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఆయన పాపులర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X