Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలీవుడ్ సింగర్‌కు చేదు అనుభవం.. కోర్టు తీవ్ర నిర్ణయం.. ఇక జైలులోనే..
బాలీవుడ్ గాయకుడు మికా సింగ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ బాలీవుడ్ సింగర్ మికా సింగ్‌ను దుబాయ్‌లో గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. మికా సింగ్ అరెస్ట్ వార్తతో బాలీవుడ్ షాక్ గురైంది. మీడియాలో గాయకుడి వేధింపుల వార్త ప్రముఖంగా మారింది. ఈ నేపథ్యంలో మికా బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మికా జైలు జీవితం గురించి మరిన్నీ వివరాలు..
బ్రెజిల్ మహిళ ఫిర్యాదుతో
అసభ్యకరమైన ఫొటోలు తనకు పంపిస్తూ వేధించాడు అని మికా సింగ్‌పై బ్రెజిల్ అమ్మాయి ఫిర్యాదు చేసింది. దాంతో మురక్కాబాత్ పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
పోలీస్ కస్టడికీ మికా
అనంతరం మికా సింగ్‌ను విచారణ కోసం కస్టడికి తరలించారరు. బాలీవుడ్ ఈవెంట్ కోసం దుబాయ్ వచ్చిన గాయకుడు మికా మహిళతో అనుచితంగా ప్రవర్తించడంతో జైలులో గడుపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మికాను జైలు నుంచి విడిపించడానికి ఆయన స్నేహితులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.
శుక్రవారం కోర్టు విచారణకు
మహిళ ఆరోపణలపై విచారణ నిమిత్తం మికా సింగ్‌ను శుక్రవారం సాయంత్రం దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనను మళ్లీ పోలీస్ కస్టడికీ తరలించారు. ఇంకా ఎన్ని రోజులు జైలులో ఉంటారో క్లారిటీ లేదు. లైంగిక వేధింపులపై మికాను అధికారులు ప్రశ్నిస్తున్నారు అని దుబాయ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
మహిళతో రాజీ చర్యలు
బ్రెజిల్ యువతితో రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆమె ఫిర్యాదు వెనక్కి తీసుకొనేలా చర్యలు తీసుకొంటున్నాం. ఇంకా మేము దుబాయ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. మికాను విడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం అని స్నేహితులు, కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మీ టూ ఉద్యమంపై మికా సింగ్
సినీ పరిశ్రమలో మీ టూ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మికా సింగ్ స్పందించాడు. మీ టూ ఉద్యమానికి తాను చేయూతనిస్తాను అని ఇటీవల ప్రకటించాడు. ఇండస్ట్రీలో బాధలు అనుభవిస్తున్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తెలుపడం సంతోషం కలిగిస్తుందని ఇటీవల మికా సింగ్ పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.