ప్రముఖ గాయకుడిపై దాడి.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతారా?
బాలీవుడ్ గాయకుడు షాన్‌పై గువాహటిలో దాడి జరిగింది. బెంగాల్ భాషలో పాడపడుతున్న షాన్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేయడంతో కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకొన్నది. గువాహటిలోని సరుసాజాయి స్టేడియంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది.
వేదికపై పాట పాడుతున్న షాన్‌పైకి ప్రేక్షకుల్లో నుంచి ఒకరు ఏదో వస్తువును విసిరి కొట్టాడు. అది గమనించిన షాన్ మధ్యలోనే కార్యక్రమాన్ని నిలిపివేశాడు. తనపై ఏదో పదార్థాన్ని విసిరిన వ్యక్తి పట్టుకొని వేదికపైకి తీసుకురావాలని నిర్వాహకులను కోరాడు.

నేను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాను. మాత్రలు వేసుకొని మీ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అలాంటి నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదు. నాతో ఇలా ప్రవర్తిస్తారా అని గాయకుడు షాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఆడియెన్స్‌లోని కొందరు షాన్‌కు క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సానుకూలంగా మారింది. నా బాధంతా ఏ ఒక్కరిపైనో కాదు. ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టే వారిపైనే అని షాన్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications