twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సింగర్ దుర్మరణం.. భర్త పొరపాటు వల్లే ఈ ఘోరం!

    |

    ప్రమాదాలని ఎవరూ ఊహించలేరు. కానీ అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి చిన్న పొరపాట్లు కూడా ఘోర ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. పలు సందర్భాల్లో సినీ సెలెబ్రిటీలు ఇలాంటి పొరపాట్ల వలనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. అలాంటి ఘోరమే మరొకటి జరిగింది. యువ బాలీవుడ్ సింగర్ శివాని భాటియా రోడ్డు ప్రమాదంలో నేడు దుర్మరణం చెందారు. ఆమె భర్త కూడా విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

    బుల్లితెర షోలతో వెలుగులోకి

    బుల్లితెర షోలతో వెలుగులోకి

    శివాని భాటియా బుల్లితెర షోలతో గాయనిగా పాపులర్ అయ్యారు. 2016లో భోజ్ పురి శింగింగ్ కాంపిటీషన్ లో సత్తా చాటిన శివాని రన్నరప్ గా నిలిచింది. అప్పటినుంచి ఆమెకు పలు బాలీవుడ్ చిత్రాల్లోకూడా అవకాశాలు వస్తున్నాయి. కాగా నేడు శివాని తన భర్త నిఖిల్ తో కలసి ఆగ్రాలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

    భర్త చేసిన పొరపాటు

    భర్త చేసిన పొరపాటు

    శివాని, నిఖిల్ ఇద్దరూ తమ ఈ ఐ 20 కారులో ఆగ్రాకు బయలుదేరారు. యమునా ఎక్స్ ప్రెస్ రహదారిపై వీరు వాహనం హై స్పీడ్ లో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. శివాని భర్త నిఖిల్ ముందు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరింత వేగంతో ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు. దీనితో వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. శివాని కూర్చున్న వైపు మొత్తం కారు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది.

     ఆసుపత్రికి తరలించగా

    ఆసుపత్రికి తరలించగా

    వెంటనే శివానిని, నిఖిల్ ని దగ్గర్లోని నియతి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివాని మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్ధారించారు. నిఖిల్ కు కూడా తీవ్రగాయాలు కావడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు శివాని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

     విషాదంలో స్నేహితులు

    విషాదంలో స్నేహితులు

    శశివానికి బాలీవుడ్ లో చాలామందే స్నేహితులు ఉన్నారు. వారంతా శివాని మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శివాని ఇప్పుడిప్పుడే గాయనిగా బాలీవుడ్ లో రాణిస్తోంది. కెరీర్ గురించి ఎన్నో కలలు కంది. చిన్న వయసులోనే శివాని మరణించడం విచారకరం అని అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింతలోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

    English summary
    Singer Shivani Bhatia Dies in Car Accident on Yamuna Expressway
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X