హీరోయిన్లు డ్రగ్స్ తీసుకొంటే.. హీరోలు పాలు తాగి.. బిస్కెట్లు తింటున్నారా? యువ సింగర్ ఆగ్రహం

బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో అగ్ర సినీ తారలను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం సంచలనం రేపుతున్నది. దేశవ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమల్లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్ వ్యవహారంలో హీరోయిన్లను విచారించడం, అరెస్ట్ చేయడంపై భారీగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో యువ గాయని సోనా మహాపాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా డ్రగ్స్ కేసు విచారణపై ఆమె ఏమని కామెంట్ చేశారంటే..

హీరోయిన్లకే డ్రగ్స్ సంబంధాలా?

హీరోయిన్లకే డ్రగ్స్ సంబంధాలా?

హీరోయిన్లనే టార్గెట్ చేసి హీరోలను తప్పిస్తున్నారా అనే అనుమానం కలుగుతున్నదనే సోనా ఆరోపణలు చేసింది. సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, దీపిక పదుకోన్, రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎన్సీబీ విచారించిన నేపథ్యంలో సోనా మహాపాత్ర ఘాటుగా స్పందించింది. కేవలం హీరోయిన్లే డ్రగ్స్ తీసుకొంటున్నారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

ఏ ఒక్కరి హీరో పేరు బయటకు రాలేదేంటి?

ఏ ఒక్కరి హీరో పేరు బయటకు రాలేదేంటి?

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేవలం హీరోయిన్ల పేర్లు బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. హిందీ చిత్ర పరిశ్రమలో అంతమంది హీరోలు ఉంటే ఏ ఒక్కరి పేరు కూడా బయటకు రాకపోవడం అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తున్నది అని సోనా మహాపాత్ర కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసులో అసలు సప్లయర్లను, డ్రగ్స్ మాఫియాను విచారించడం లేదనే అనుమానం కలుగుతున్నది అని సోనా మహాపాత్ర అన్నారు.

హీరోలు పాలు తాగుతూ, బిస్కెట్లు తింటున్నారా?

హీరోలు పాలు తాగుతూ, బిస్కెట్లు తింటున్నారా?

డ్రగ్స్ కేసులో హీరోయిన్ల పేర్లు బయటకు రావడంతో ఈ విచారణ సరైన రీతిలో జరుగుతున్నదా అనే అనుమానం కలుగుతున్నది. సినీ పరిశ్రమలోని హీరోలు కేవలం పాలు, బిస్కట్లు తింటున్నారా? ఈ వ్యవహారంలో నాకు హీరోయిన్ల మీద గానీ, ఇతరుల మీద గానీ సానుభూతి లేదు. ఈ కేసులో ఒక్క హీరో పేరు బయటకు రాకపోవడంతో అందరి మాదిరిగానే నాలో అనుమానాలు రేకెత్తుతున్నాయి అని సోనా మహాపాత్ర పేర్కొన్నారు.

కంగన‌కు అంత సీన్ లేదు..

కంగన‌కు అంత సీన్ లేదు..

తనను ట్విట్టర్‌లో కంగన టీమ్ బ్లాక్ చేయడంపై సోనా పాత్ర స్పందించారు. కంగన సొంత ప్రయోజనాలకే పాకులాడుతారు. ఎవరికైనా సమస్యలు వస్తే అండగా నిలిచిన దాఖలాలు లేవు. సినీ పరిశ్రమలో మార్పు తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఆమెలో లేవు. కంగనకు అంత విలువ కూడా లేదు. కాకపోతే ఇండస్ట్రీలో జరిగే అరాచకాలను బయటపెట్టే ధైర్యం ఆమెలో ఉంది. ఆమె ఓ మేకవన్నె పులి అంటూ ఘాటుగా విమర్శించారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసు విచారణలో

బాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసు విచారణలో

ఇదిలా ఉండగా, బాలీవుడ్‌తో డ్రగ్స్ సంబంధాలపై కొద్ది రోజులుగా ఎన్సీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా బయటపడిన డ్రగ్స్ లింకు కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీపిక పదుకోన్, సారా ఆలీఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసి గతవారం ప్రశ్నించడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X