twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కనే ఈమె ఉండగా మళ్లీ ఆమెపై.. ఛీ చాలా నీచాతి నీచంగా.. స్టార్ హీరోపై సింగర్ ఫైర్

    |

    ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే.. అనవసమైన వాటిల్లో తలదూరిస్తే చివాట్లు తినక తప్పదు.సెలెబ్రిటీలు ఒకప్పుడు ఎలా ఉన్న నడిచేది కానీ, నేటి డిజిటల్ యుగంలో ఎవ్వరేం మాట్లాడినా, చేయకూడని పనులు చేసినా వెంటనే అవి వైరల్ అవుతున్నాయి. దీంతో అలాంటి వాటిపై ఎవ్వరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ సదరు సెలెబ్రిటీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ని కామెంట్ చేసి ఇలాంటి ఇరకాటం లోనే పడిపోయారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.

    భారత్ మూవీ

    భారత్ మూవీ

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది భారత్ మూవీ. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 5 వ తేదీన విడుదల కానుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. కానీ ఆమె తన పెళ్లి కారణంగా సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రినాను తీసుకున్నారు.

    సల్మాన్ చెప్పినా ప్రియాంక వినలేదు

    సల్మాన్ చెప్పినా ప్రియాంక వినలేదు

    తన పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ప్రియాంక చోప్రాకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో.. సల్మాన్ ఖాన్ రాజీకి వచ్చారట. ఆమె కోసం డేట్స్ లో మార్పులు చేసుకుంటానని చెప్పినా కూడా ప్రియాంక చోప్రా వినకుండా సినిమా నుంచి తప్పుకుందట. ప్రియాంక ఇలా తప్పుకోవడం నచ్చని సల్మాన్.. టైమొచ్చిన ప్రతీ సారి ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్ చేస్తున్నారు.

    భర్త కోసం 'భారత్'నే వదులుకుంది

    భర్త కోసం 'భారత్'నే వదులుకుంది

    ఓ సందర్భంలో ప్రియాంక చోప్రాకు 'భారత్' కంటే అమెరికా ఎక్కువైపోయిందని పేర్కొన్న సల్మాన్ అంతటితో ఆగక భర్త కోసం ఏకంగా 'భారత్'నే వదులుకుందని విమర్శించాడు. ఈ విమర్శ చూసిన ప్రముఖ గాయని సోనా మొహాపాత్ర సల్మాన్ తీరుపై మండిపడటం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

    సల్మాన్‌పై సింగర్ ఫైర్

    సల్మాన్‌పై సింగర్ ఫైర్

    ఈ ఉదంతం చూసి సల్మాన్ ఖాన్‌పై గాయని సోనా మొహాపాత్ర సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకకు జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆమె 'భారత్' నుండి తప్పుకుంది. తన భర్తతో, కుటుంబంతో ఉండాలనుకుంది.. అందులో తప్పేముంది అంటూ ప్రియాంకను సపోర్ట్ చేసింది.

    ఇదో నీచమైన పని

    ఇదో నీచమైన పని

    ముఖ్యంగా ప్రియాంక చోప్రా తన ప్రయాణంతో ఎందరో ఆడపిల్లలకు స్పూర్తిగా నిలుస్తుండటం ఆదర్శనీయం అని పేర్కొంది గాయని సోనా మొహాపాత్ర. అయినా ఈ దేశంలో లేని అమ్మాయి గురించి కామెంట్లు చేయడమెందుకు? అదికాకుండా పక్కనే మరో అమ్మాయి (కత్రినా కైఫ్) ఉండగా ప్రియాంక చోప్రాపై కామెంట్స్ చేయడం నీచమైన పని కాదా? అని పేర్కొంటూ సల్మాన్ ని కడిగిపారేసింది సదరు గాయని.

    English summary
    Singer Sona Mohapatra fire on Salman Khan for His 'Low Brow' Dig at Priyanka Chopra Over Quitting Bharat movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X