twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తామంటూ గాయనికి బెదిరింపులు.. స్టార్ హీరో అభిమానుల నిర్వాకం

    |

    తమ అభిమాన హీరోని కామెంట్ చేసిందనే కసితో ఏకంగా చంపేస్తామంటూ రంగంలోకి దిగారట సదరు హీరో ఫ్యాన్స్. ఇటీవలే హీరోయిన్ ప్రియాంక చోప్రాను ఉద్దేశిస్తూ హీరో సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి చూసిన సింగర్ సోనా మొహాపాత్ర సోషల్ మీడియా వేదికగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ సింగర్‌ని చంపేస్తామని బెదిరిస్తున్నారట సల్మాన్ అభిమానులు. ఈ విషయాన్ని సింగర్ సోనా మొహాపాత్ర స్వయంగా వెల్లడించారు.

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది భారత్ మూవీ. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 5 వ తేదీన విడుదల కానుంది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. కానీ ఆమె తన పెళ్లి కారణంగా సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో కత్రినాను తీసుకున్నారు. దీంతో ప్రియాంక చోప్రా తప్పుకొన్నారన్న కోపంలో ఉన్న సల్మాన్‌ కొన్ని రోజులుగా అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

    Singer Sona Mohapatras latest tweet on Salman Kahan fans behaviour

    అయితే ఇది చూసిన సింగర్ సోనా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ''జీవితంలో ప్రియాంకకు జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఆమె 'భారత్' నుండి తప్పుకుంది. తన భర్తతో, కుటుంబంతో ఉండాలనుకుంది. అందులో తప్పేముంది అయినా ఈ దేశంలో లేని అమ్మాయి గురించి కామెంట్లు ఎందుకు? ఓ యువతిపై ఇలా కామెంట్లు చేయడం చాలా నీచమైన పని. ఇలా ప్రవర్తించే వారిని ప్రపంచం ముందు నిలబెడితే తప్ప దేశంలో మార్పు కన్పించదు'' అని సల్మాన్ పై ఫైర్ అయింది

    దీంతో సింగర్ సోనా కోపం మీదున్న సల్మాన్‌ అభిమానులు నోరు అదుపులో పెట్టుకోకపోతే చంపేస్తామంటూ ఆమెను బెదిరిస్తున్నారట. అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా గాయని సోనా ట్విటర్‌ ద్వారా పేర్కొంది. ''ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌ నాకు రోజూ వస్తూనే ఉంటాయి. తప్పుగా వ్యాఖ్యలు చేసే సల్మాన్‌ ఖాన్‌ 'భారత్' టైటిల్‌తో సినిమా చేయడం హాస్యాస్పదంగా ఉంది'' అంటూ జాతీయ మహిళా సంఘాన్ని ట్యాగ్‌ చేసింది గాయని సోనా. చూడాలి మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో!

    English summary
    Singer Sona Mohapatra fire on Salman Khan for His 'Low Brow' Dig at Priyanka Chopra Over Quitting Bharat movie. On this issue Salman fans abuse Sona Mohapatra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X