Suchi Leaks కరణ్ జోహర్, షారుక్ ఖాన్ ఇద్దరు గేలు.. మా ఆయన కూడా వాళ్లతో కలిసి.. బాలీవుడ్‌లో సుచిత్ర పెంట!

అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాల సమయంలో టాప్ ఫిల్మ్ సెలబ్రెటీలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు సింగర్ సుచిత్ర. 'సుచీ లీక్స్ ' పేరిట ఆమె రేపి దుమారం అంతా ఇంతా కాదు. ఆవిడ నెక్ట్స్ ఎవరి బండారం బయటపెడతారోనని అంతా బిక్కిబిక్కుమంటూ గడిపారు. తర్వాత ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న సుచిత్ర ఎందుకో సైలెంట్ అయ్యారు. తారనె మానసిక వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలపగా.. భర్త కార్తీక్ కుమార్‌ విడాకులు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఈ పరిణామాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ మళ్లీ ఇన్నాళ్లకు ఆమె నిద్రలేచారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తుఫాను రేపుతోంది. తన భర్త కార్తీక్ కుమార్ గే అని.. స్టార్ హీరో ధనుష్ భార్య , హీరోయిన్ త్రిష, వనితా విజయ్ కుమార్, బైల్వాన్ రంగనాథన్‌లపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

Singer Suchitra sensational comments on Shah Rukh Khan amp amp Karan Johar

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య ధనుష్‌ని పెళ్లి చేసుకున్న సమయంలో వేరే వాళ్లతో డేటింగ్‌లో వుందని సుచిత్ర చెప్పారు. అలాగే ధనుష్‌కి కూడా పలువురితో అఫైర్స్ ఉన్నాయని.. ఆయనకు తెల్లవారుజామున 3 గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ గ్రూప్ ఉందని ఆరోపించింది. అంతేకాదు.. సుచీ లీక్స్ పేరుతో తాను గతంలో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

Singer Suchitra sensational comments on Shah Rukh Khan amp amp Karan Johar

తాజాగా కోలీవుడ్ మీదుగా సుచిత్ర దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఏకంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌లనే కెలికింది. వారిద్దరూ స్వలింగ సంపర్కులని (గే) సుచిత్ర ఆరోపించింది. ఇప్పటికే తన భర్త కార్తీక్ కుమార్ గే అని చెప్పిన ఆమె.. ఆయన లండన్‌లో కరణ్, షారుఖ్‌లతో '' గే ఎన్‌కౌంటర్ '' జరిగిందని పేర్కొంది. పలువురు బీ-టౌన్ పెద్దలు తరచుగా '' గే సెక్స్‌ను చట్టబద్ధం '' చేసిన దేశాలను సందర్శిస్తూ ఉంటారని సుచిత్ర ఆరోపించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదరు క్లిప్‌లో.. కార్తీక్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు కరణ్ జోహార్.. షారుక్ ఖాన్‌లను కలిశాడు. వారు బార్‌లతో నిండిన ఓ ప్రాంతంలో సమావేశమై.. క్రాస్ డ్రెస్‌లు వేసుకున్నారు. కరణ్, షారుక్‌లు తరచుగా విదేశాలకు వెళ్లినప్పుడు వారు అలాంటి దుస్తులు ధరించి రాత్రుళ్లు ఎంజాయ్ చేస్తారని సుచిత్ర చెప్పింది. ఈ వ్యాఖ్యలపై కార్తీక్ స్పందించారు. తాను స్వలింగ సంపర్కుడిగా ఉండటానికి సిగ్గుపడను అని వ్యాఖ్యానించారు.

Singer Suchitra sensational comments on Shah Rukh Khan amp amp Karan Johar

అయితే బాలీవుడ్ వర్గాలు, ప్రత్యేకించి కరణ్ జోహర్, షారుక్ ఖాన్‌లు కానీ వారి టీమ్స్‌ కానీ సుచిత్ర వ్యాఖ్యలపై స్పందించలేదు. రానున్న రోజుల్లో ఆమె ఇంకెందరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. కానీ వీటి వల్ల అంతిమంగా సుచిత్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే ఆమెను స్పూర్తిగా తీసుకుని ఇంకొందరు మరో లీక్స్ పేరిట ఏవేవో చెప్పరని గ్యారంటీ ఏంటీ. అందుకే పరిశ్రమ పెద్దలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X