సెల్ఫీ కోసం వస్తే.. మహిళలపై ఫేమస్ సింగర్ ముద్దుల వర్షం
సమాజంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నలుగురికి మార్గదర్శకంగా ఉండేటట్లు నడుచుకోవాలి. అలా కాదని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే.. చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. దీంతో ఇన్ని రోజులు సంపాదించుకున్న పరువుప్రతిష్టలు మట్టి పాలవుతాయి. అలా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి వివాదంలో చిక్కుకున్నాడు ఓ బాలీవుడ్ ప్రముఖ గాయకుడు. నలుగురితో ఛి అనిపించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీ సింగర్ ఎవరంటే..?
ఆ సింగర్ ఎవరో కాదు.. బాలీవుడ్ నేపధ్య గాయకుడు, ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్. ఆయన ఎన్నో సినిమాలకు పాటలు పాడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. కేవలం సినిమా పాటలు కాకుండా.. ప్రాంతీయ భాషలలో కూడా పాటలు పాడి, అందరి మనసును దోచుకున్నారు. తన సినీ ప్రస్థానంలో నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినీ కళామతల్లికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ లతో సత్కరించింది. యావత్తు సీని ప్రపంచం ఆయనను ప్రశంసించింది.

దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఉదిత్ నారాయణ్.. ఆయన అభిమానితో హద్దు మీరి ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఏకంగా లైవ్ షోలోనే అమ్మాయిలకు లిప్ లాక్‌లు ఇచ్చి రెచ్చిపోయారు. ఉదిత్ నారయణ్ ఓ షోలో స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. కొంతమంది మహిళ అభిమానులు తన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు స్టేజి దగ్గరకు వచ్చారు. ఆయన సెల్ఫీతో పాటు వారిని ముద్దు పెట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా ఆయన ఒక అభిమానికి అయితే ఏకంగా లిప్‌లాక్ ఇచ్చారు. దీంతో ఆ లేడీ అభిమాని కూడా షాక్‌కు గురి కావడంతో పాటు నోరెళ్లబెట్టింది. ఇక అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం ఉదిత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఉదిత్‌ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు చేయడమేంటీ? అని ఫైర్ అవుతున్నారు. మరికొందరైతే.. కూతురు వయసున్న అమ్మాయితో ఇలానా వ్యవహరించడం. ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదంటూ
దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సంఘటనపై ఉదిత్ స్పందించారు. ' ఆ మహిళ అభిమానులకు తానేనంటే ఇష్టం. తమ ఇష్టాన్ని చెప్పడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు ముద్దు తనని పెట్టుకోవాలనుకుంటారు. ఇది కేవలం ఆత్మీయత మాత్రమే. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి .నాకు వేరే ఉద్దేశం లేదు. నేను వివాదాలకు చాలా దూరం ఉంటాను' అంటూ తనని తాను సమర్థించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











