twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anupam Shyam.. సినీ పరిశ్రమలో మరో విషాదం.. ‘సత్య’ ఫేమ్ నటుడు కన్నుమూత

    |

    ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ ఇకలేరు. గతవారం కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్‌ చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం అంటే ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున మరణించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గత కొద్ది నెలలుగా పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అనుపమ్ శ్యామ్ మరణవార్తను స్నేహితుడు, నటుడు యశ్‌పాల్ శర్మ తెలిపారు. అనుపమ్ శ్యామ్ నాలుగు రోజుల క్రితం గోరేగావ్ లోని, లైఫ్‌లైన్ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. తుది శ్వాస విడిచిన సమయంలో ఆయన వద్దే తన సోదరులు అనురాగ్, కంచన్ ఉన్నారని పేర్కొన్నారు. అనుపమ్ మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృ‌తికి పలువురు సినీ ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించారు.

    అనుపమ్ శ్యామ్ మరణం గురించి మరిని వివరాలు అందిస్తూ.. కొద్దిసేపటి క్రితమే ఆయన లేరని వైద్యులు సమాచారం అందించారు. ఆయన సోదరులతోపాటే హాస్పిటల్‌కు వెళ్లాను. ఆయన పార్థీవ దేహాన్ని నివాసానికి తరలించి అభిమానులు, స్నేహితులు, బంధువుల చివరి చూపుకోసం ఉంచుతాం. సోమవారం సాయంత్రం కల్లా అంత్యక్రియలు జరుపుతాం అని యశ్‌పాల్ శర్మ తెలిపారు.

    Slumdog Millionaire actress Anupam Shyam died at the age of 63

    గత ఏడాది అనుపమ్‌కు డయాలిస్ నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయారు. అప్పటి నుంచే ఆయన తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. ఆర్థికంగా చితికి పోవడంతో వైద్య అవసరాలకు డబ్బులేకపోవడంతో సహాయం చేయాలని ఆర్థించరు. ఆయనకు చికిత్స కోసం పలువురు ఆర్థికంగా సహాయం అందించి ఆదుకొన్నారు.

    అనుపమ్ శ్యామ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తను తెలుసుకొన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఆర్థికంగా అండగా నిలిచింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను వైద్య ఖర్చుల కోసం అందజేసింది. మనోజ్ బాజ్‌పేయ్, బీయింగ్ హ్యుమన్ సంస్థలు ఆర్థికంగా తోడ్పాటునందించాయి. సినీ అండ్ టెవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సింటా కూడా ఆర్థిక సహాయం అందించింది. అనుపమ్ శ్యామ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్తను తెలుసుకొన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఆర్థికంగా అండగా నిలిచింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను వైద్య ఖర్చుల కోసం అందజేసింది. మనోజ్ బాజ్‌పేయ్, బీయింగ్ హ్యుమన్ సంస్థలు ఆర్థికంగా తోడ్పాటునందించాయి. సినీ అండ్ టెవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సింటా కూడా ఆర్థిక సహాయం అందించింది.

    అనుపమ్ శ్యామ్ విషయానికి వస్తే.. టీవీ సీరియల్ మన్ కీ అవాజ్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. బాలీవుడ్‌లో స్లమ్ డాగ్ మిలియనీర్, బండిట్ క్వీన్ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. మూడు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్‌లో సత్య, దిల్ సే, లగాన్, హాజరోంకి క్వాయిషీన్ ఐసీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. స్టార్ ప్లస్‌లో 2009లో ప్రసారమైన మన్ కీ అవాజ్ సీరియల్‌లో థాకూర్ సజ్జన్ సింగ్ పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.

    నటుడు అనుపమ్ శ్యామ్ మరణంతో విషాదంలో మునిగిపోయాను. నాకు మంచి స్నేహితుడు, గొప్ప నటుడు లేరంటే నమ్మబుద్ది కావడం లేదు. ఓ గొప్ప మనిషిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అంటూ నటుడు మనోజ్ జోషి ట్వీట్ చేశారు.

    నటుడు అశోక్ పండిట్ శ్రద్దాంజలి ఘటిస్తూ.. దేశంలోని గొప్ప నటుల్లో ఒకరైన అనుపమ్ శ్యామ్ ఇక లేరంటే షాక్ గురయ్యాను. పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఆయన మరణించారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు.

    English summary
    Popular Character Artist Anupam Shyam is no more. He was died due to multiple organ failure. He died on August 9th, 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X