నీ భర్తను ‘పాపాజీ’ అని పిలువు... మిలింద్, అంకితపై ట్రోల్స్
మిలింద్ సోమన్, అంకితా కొన్వర్ అసాధారణమైన ప్రేమకథ హాట్ టాపిక్ అవ్వడానికి కారణం వారి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. మిలింద్ 53 ఏళ్ళ వయసులలోనూ బలంగా, హ్యాండ్సమ్ లుక్ ఉండగా... అంకిత ఇటీవల(ఆగస్ట్ 30)న తన 28వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఇద్దరూ కిలిమంజారో పర్వతం ఎక్కి మరోసారి వార్తల్లో నిలిచారు.
మిలింద్, అంకిత కలిసి ఇటీవల ఓరల్ హెల్త్‌కేర్ బ్రాండ్ తరుపున #FreeToLove అనే కాంపెయిన్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఈ జంట సోషల్ మీడియాలో వారి గురించి వస్తున్న కామెంట్లను చదువుతూ కనిపించారు.

అతడిని పాపాజీ అని పిలవాలి...
అందులో ఒక వ్యాఖ్యలో అంకిత... మిలింద్‌ను 'పాపాజీ' అని పిలవాలని ఉంది. దీనికి మిలింద్ 'ఆమె కొన్నిసార్లు అలా పిలుస్తుంది' అని చమత్కరించారు. తన తల్లితో తనకు వయసు తేడా ఎంత ఉందో... అంకితకు, తనకు మధ్య అంతే ఉందని తెలిపారు.

మా పెళ్లికి ఇంట్లో ముందు ఒప్పుకోలేదు
మిలింద్, అంకిత ఐదేళ్ల డేటింగ్ చేసి... ఈ ఏడాది ఏప్రిల్ 22న అలీబాగ్‌లో సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట తల్లిదండ్రులు తమ సంబంధంపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.... తాము కలిసి ఉంటే సంతోషంగా ఉంటామని వారికి వివరించడంతో తమ పెళ్లికి ఒప్పుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తమకు ఇష్టమైన వారిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి
సమాజంలో తమ బంధంపై వ్యక్తం అవుతున్న విమర్శలపై స్పందిస్తూ... ‘‘ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డపుడు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ తాము ఇష్టపడే వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉండాలని భావిస్తున్నాను. వారి హృదయంలో ఉన్న భావాలతో సమాజానికి సంబంధం లేదు.'' అని మిలింద్ తెలిపారు.

స్పెయిన్లో మరోసారి వివాహం
అలీబాగ్‌లో వివాహం తర్వాత మిలింద్ సోమన్, అంకిత కొన్వర్ మళ్లీ స్పెయిన్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సంతోషంగా జీవితం సాగిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎవరి నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకోవడం లేదు.


Click it and Unblock the Notifications











