అనుష్క శర్మని ఎలా పడితే అలా.. కనికరం లేకుండా.. ఇదేమి ట్రోలింగ్ బాబోయ్!
Recommended Video

అనుష్క శర్మ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలదు. విరాట్ కోహ్లీతో వివాహం తరువాత కూడా అనుష్క శర్మ బాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా అనుష్క శర్మ నటిస్తున్న సూయి ధాగా. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అనుష్క శర్మపై జోకులు, సెటైర్లతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మోత మోగుతోంది.

సహజసిద్ధమైన
సూయి ధాగా చిత్రంలో వరుణ్ ధావన్, అనుష్క జంటగా నటిస్తున్నారు. రబ్ నే బానది జోడి తరహాలో అనుష్క భార్యగా మరో సహజసిద్ధమైన పాత్రలో నటిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ ఇద్దరూ డీగ్లామర్ రోల్స్ లో నటిస్తున్నారని చెప్పొచ్చు.

మేడ్ ఇన్ ఇండియా
సూయి ధాగా.. మేడ్ ఇన్ ఇండియా అనేది క్యాప్షన్. వరుణ్ ధావన్, అనుష్క శర్మ ఈ చిత్రంలో పేద దంపతులుగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్ ట్రైలర్ నుంచి వస్త్రాల కంపెనీ ప్రారంభించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేదే ఈ చిత్ర కథ.

హావభావాలు
ఈ చిత్రంలో అనుష్క సహజత్వానికి దగ్గరగా కొన్ని హావభావాలు పలికించింది. ట్రైలర్ లోని కొన్ని స్టిల్స్ వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు విపరీతంగా అనుష్క శర్మని ట్రోలింగ్ చేస్తున్నారు. అనుష్క శర్మ హావభావాలపై నెటిజన్లు వారికి తోచిన విధంగా సెటైర్లు వేస్తున్నారు.
దుమారం
అనుష్క శర్మ ట్రోలింగ్ దుమారం రేపుతోంది. ఎట్టకేలకు ఇంటర్ మీడియట్ పాసైతే తల్లి కళ్ళలో కనిపించే ఆనందం ఇదే. వీకెండ్ లో ఆఫీస్ కు వెళుతుంటే కలిగే ఫీలింగ్ ఇదే అంటూ అనుష్క శర్మ స్టిల్ పై జోకులు పేలుస్తున్నారు.
డిఆర్ఎస్ డెసిషన్
విరాట్ కోహ్లీ తీసుకున్న డిఆర్ఎస్ నిర్ణయం సరైనది అయినప్పుడు కలిగే ఫీలింగ్. ఆగష్టు 15, జనవరి 26 న దేశభక్తి పెరిగినపుడు.. ఇలా నెటిజన్లు అంతా ఆత్మ క్రియేటివిటీని అనుష్క శర్మని ట్రోలింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు.


Click it and Unblock the Notifications











